News November 9, 2024
సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు.. హైకోర్టు ఆగ్రహం

AP: రాష్ట్రంలో కొనసాగుతున్న YCP సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టులపై హైకోర్టు మండిపడింది. చట్ట నిబంధనలు పాటించకుంటే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని, పౌరుల స్వేచ్ఛను తేలికగా తీసుకోవద్దని పోలీసులను హెచ్చరించింది. పలు బాధిత కుటుంబాల హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది. రెండు పోలీస్ స్టేషన్లలోని సీసీ ఫుటేజీని స్థానిక మేజిస్ట్రేట్లకు అందజేయాలని ఆదేశించింది.
Similar News
News September 14, 2025
బాక్సింగ్‌లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్

UKలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. 48 కిలోల విభాగం ఫైనల్‌లో మీనాక్షి హుడా విజేతగా నిలిచారు. కజకిస్తాన్ ప్లేయర్ నజీమ్ కైజైబేపై 4-1 తేడాతో ఆమె ఘన విజయం సాధించారు. కాగా బాక్సింగ్ విభాగంలో భారత్ తరఫున జైస్మిన్ లాంబోరియా ఇప్పటికే ఓ గోల్డ్ మెడల్ కొల్లగొట్టారు.
News September 14, 2025
ప్రైవేట్ కాలేజీల బంద్.. కాసేపట్లో కీలక చర్చ

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్ కాలేజీలు సోమవారం నుంచి <<17692548>>బంద్<<>> ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రతినిధులతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇవాళ రాత్రి 7 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు వారితో చర్చలు జరపనున్నారు. మరోవైపు కాలేజీల బంద్‌కు AISF మద్దతు ప్రకటించింది.
News September 14, 2025
హైదరాబాద్‌లో మొదలైన వర్షం

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, అల్వాల్, సుచిత్ర, కొంపల్లి, కంటోన్మెంట్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. కాసేపట్లో నగరంలోని ఇతర ఏరియాలకూ విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. మరి మీ ప్రాంతంలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.