News November 9, 2024
పాలమూరు జిల్లాలో ACBకి పట్టుబడ్డ అధికారులు వీళ్లే!1/2
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది <<14566088>>ACBకి <<>>14 మందిపై కేసులు నమోదు కాగా.. 21 మందిని కోర్టులో హాజరుపరిచారు. JAN 20న రమావత్ వశ్య (డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే), 22న బాలోజీ (ఎక్సైజ్ CI),29న జీవరత్నం (లైన్‌మెన్), FEB 4న సురేష్(SI), 10న ఎస్.పృథ్వీ (ఏఈ), MAR 27న పాండునాయక్ (MRO), రవీందర్ రెడ్డి (ధరణి ఆపరేటర్),మొగులప్ప(రికార్డు అసిస్టెంట్), MAY 31న నరేందర్ కుమార్(డీఈ), వెంకటనాగేంద్ర కుమార్ (ఎస్ఈ), బి.మధుకర్(ఏఏఈ)
Similar News
News November 24, 2024
NRPT: జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రత ఈ గ్రామంలోనే
NRPT జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గత 5 రోజులుగా జిల్లా వ్యాప్తంగా విపరీతమైన చలి పెరగగా వాహనదారులు, వాకర్లు చలికి ఇబ్బంది పడుతున్నారు. నారాయణపేట జిల్లాలోని దామర్ గిద్ద మండలంలోని మొగల్ మడ్క గ్రామాల్లో ఆదివారం 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రతల నుంచి 17.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News November 24, 2024
MBNR: 27 నుంచి సెమిస్టర్-2 ప్రయోగ పరీక్షలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో సైన్స్ & కంప్యూటర్ చదువుతున్న డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు MVS డిగ్రీ కళాశాలలో ఈనెల 27 నుంచి ప్రయోగ పరీక్షలు (సెమిస్టర్-2) నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మావతి, రీజినల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్, ఫీజు చెల్లించిన రసీదు, గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు.
News November 23, 2024
30న పాలమూరుకు సీఎం రేవంత్ రాక
మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 30న వస్తున్నట్లుదేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్‌లతో మధ్యాహ్నం 12:00 గంటలకు సమీక్ష సమావేశం ఉంటుందన్నారు.