News November 9, 2024
ఇవాళ సెలవు లేదు
TG: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాన్నీ రెండో శనివారమైనా ఇవాళ పనిచేయనున్నాయి. సెప్టెంబర్ 17న గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ 3 జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. బదులుగా నవంబర్ 9న రెండో శనివారం సెలవు రద్దు చేసింది. దీంతో ఇవాళ ఈ 3 జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ యథావిధిగా పనిచేస్తాయి.
Similar News
News December 27, 2024
ఆస్పత్రిలో మన్మోహన్ సింగ్.. చివరి ఫొటో
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. ఆయన ఆస్పత్రిలో ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తలపాగా, గడ్డం లేకుండా ఆయన కనిపించారు. కాగా మన్మోహన్ కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.
News December 27, 2024
మన్మోహన్‌ను రాజకీయాల్లోకి తెచ్చింది పీవీనే
RBI గవర్నర్‌గా ఉన్న మన్మోహన్‌కు రాజకీయాలు పరిచయం చేసింది PV నరసింహారావు అనే చెప్పాలి. 1991లో దుర్భర ఆర్థిక పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి సింగ్‌ను రాజ్యసభకు పంపి ఆర్థిక మంత్రిని చేశారు. Liberalisation, Privatisation, Globalisation పాలసీతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణ ద్వారా నాటి సంస్కరణలు నేటికీ చిరస్థాయిగా నిలిచాయి.
News December 26, 2024
ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు
1932 Sep 26న ఇప్పటి పాక్‌లోని చక్వాల్‌లో మన్మోహన్ సింగ్ జన్మించారు. 2004-2014 వరకు ప్రధానిగా ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేశారు. నెహ్రూ, ఇందిరా, మోదీ తరువాత అత్యధిక కాలం దేశ ప్రధానిగా కొనసాగారు. 33 ఏళ్లపాటు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. 1991లో రాజ్యసభలో అడుగుపెట్టారు. PV హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆర్థిక శాఖలో సలహాదారుగా, కార్యదర్శిగా, RBI గవర్నర్‌గా కూడా పనిచేశారు.