News November 9, 2024
అమరావతిలో ESI ఆస్పత్రికి కేంద్రం ఓకే!

AP: అమరావతిలో 500 పడకలతో ESI ఆస్పత్రి, 150 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు కేంద్రం సూత్రప్రాయంగా ఓకే చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత HYDలోని ఈఎస్ఐ ఆస్పత్రిని తెలంగాణకు కేటాయించడంతో AP కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. నిబంధనల మేరకు 10 ఎకరాలు కేటాయించాల్సి ఉంటుంది. ఆస్పత్రి నిర్మాణం, నిర్వహణ ESI కార్పొరేషన్‌కు అప్పగిస్తే రాష్ట్రంపై భారం ఉండదు. తప్పదనుకుంటే ఒప్పంద వ్యయంలో 1/8 వంతు భరించాలి.
Similar News
News September 14, 2025
రేపు, ఎల్లుండి కలెక్టర్ల కాన్ఫరెన్స్

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రేపు, ఎల్లుండి కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. పౌరసేవలు, పథకాల అమలుపై జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ఈ కాన్ఫరెన్స్ జరుగుతుందని CM ఇప్పటికే వెల్లడించారు. తొలిరోజు వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల పురోగతితో పాటు సూపర్ సిక్స్ పథకాలు, అన్న క్యాంటీన్లు, P-4పై సమీక్షించనున్నారు. రెండో రోజు వైద్యం, క్వాంటం వ్యాలీ, మున్సిపల్, పంచాయతీరాజ్ అంశాలపై చర్చించనున్నారు.
News September 14, 2025
బాక్సింగ్‌లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్

UKలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. 48 కిలోల విభాగం ఫైనల్‌లో మీనాక్షి హుడా విజేతగా నిలిచారు. కజకిస్తాన్ ప్లేయర్ నజీమ్ కైజైబేపై 4-1 తేడాతో ఆమె ఘన విజయం సాధించారు. కాగా బాక్సింగ్ విభాగంలో భారత్ తరఫున జైస్మిన్ లాంబోరియా ఇప్పటికే ఓ గోల్డ్ మెడల్ కొల్లగొట్టారు.
News September 14, 2025
ప్రైవేట్ కాలేజీల బంద్.. కాసేపట్లో కీలక చర్చ

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్ కాలేజీలు సోమవారం నుంచి <<17692548>>బంద్<<>> ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రతినిధులతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇవాళ రాత్రి 7 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు వారితో చర్చలు జరపనున్నారు. మరోవైపు కాలేజీల బంద్‌కు AISF మద్దతు ప్రకటించింది.