News November 9, 2024

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ వాయిదా

image

TG: BRSలో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన MLAలపై అనర్హత అంశంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఫిర్యాదు చేసిన 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని BRS వాదనలు వినిపించింది. దీనిపై విచారణను ధర్మాసనం ఎల్లుండికి వాయిదా వేసింది. కాగా ఫిరాయింపు MLAపై 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలన్న సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును అసెంబ్లీ కార్యదర్శి న్యాయస్థానంలో అప్పీల్ చేశారు.

Similar News

News September 14, 2025

రేపు, ఎల్లుండి కలెక్టర్ల కాన్ఫరెన్స్

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రేపు, ఎల్లుండి కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. పౌరసేవలు, పథకాల అమలుపై జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ఈ కాన్ఫరెన్స్ జరుగుతుందని CM ఇప్పటికే వెల్లడించారు. తొలిరోజు వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల పురోగతితో పాటు సూపర్ సిక్స్ పథకాలు, అన్న క్యాంటీన్లు, P-4పై సమీక్షించనున్నారు. రెండో రోజు వైద్యం, క్వాంటం వ్యాలీ, మున్సిపల్, పంచాయతీరాజ్ అంశాలపై చర్చించనున్నారు.

News September 14, 2025

బాక్సింగ్‌లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్

image

UKలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. 48 కిలోల విభాగం ఫైనల్‌లో మీనాక్షి హుడా విజేతగా నిలిచారు. కజకిస్తాన్ ప్లేయర్ నజీమ్ కైజైబేపై 4-1 తేడాతో ఆమె ఘన విజయం సాధించారు. కాగా బాక్సింగ్ విభాగంలో భారత్ తరఫున జైస్మిన్ లాంబోరియా ఇప్పటికే ఓ గోల్డ్ మెడల్ కొల్లగొట్టారు.

News September 14, 2025

ప్రైవేట్ కాలేజీల బంద్.. కాసేపట్లో కీలక చర్చ

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్ కాలేజీలు సోమవారం నుంచి <<17692548>>బంద్<<>> ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రతినిధులతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇవాళ రాత్రి 7 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు వారితో చర్చలు జరపనున్నారు. మరోవైపు కాలేజీల బంద్‌కు AISF మద్దతు ప్రకటించింది.