News November 9, 2024
మళ్లీ ఆపద్భాందవుడిలా మారిన ధ్రువ్ జురెల్

ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఇండియా ఏ ఆటగాడు ధ్రువ్ జురెల్ ఆపద్భాందవుడిగా మారారు. రెండో ఇన్నింగ్స్లో 44/4తో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన జురెల్ (68) అర్ధ సెంచరీతో రాణించారు. దీంతో భారత్ 206/7తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. కాగా తొలి ఇన్నింగ్స్లో కూడా జట్టు 11/4తో కష్టాల్లో ఉన్నప్పుడు జురెల్ (80) ఆదుకున్నారు. ఆయన రాణించడంతో భారత్ 161 పరుగులైనా చేయగలిగింది.
Similar News
News January 1, 2026
విశాఖలో కూటమి నేతల ఐక్యత స్వరం

స్టీల్ ప్లాంట్, విశాఖ భూముల అంశాలు, తదితర సమస్యలపై YCP, వామపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు సమాధానం చెప్పే విషయంలో విశాఖ MP, MLAలు ఒక్కో విధంగా స్పందిస్తున్నారనే విమర్శలు వినిపించాయి. దీంతో వీరి మధ్య సరైన సమన్వయం లేదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయన్న వాదనలున్నాయి. అయితే అనూహ్యంగా బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ‘మేమంతా కలిసే ఉన్నాం’ అని సంకేతాలిచ్చారు.
News January 1, 2026
పండగకు, జాతరకు స్పెషల్ బస్సులు.. ఛార్జీల పెంపు!

TG: సంక్రాంతికి, మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా RTC ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సంక్రాంతికి HYD నుంచి ఈ నెల 9-13 వరకు 6,431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అటు మేడారం జాతరకు ఈ నెల 25 నుంచి హైదరాబాద్ నుంచే 3,495 స్పెషల్ బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. రెగ్యులర్ బస్సుల్లో సాధారణ టికెట్ ఛార్జీలు, ప్రత్యేక బస్సుల్లో 50% మేర పెంపు ఉంటాయన్నారు.
News January 1, 2026
కరెంట్ ఛార్జీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

AP: కరెంట్ ఛార్జీలపై ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సుమారు ₹4,498 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని జనంపై మోపకుండా తానే భరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు APERCకి అధికారులు లేఖ రాశారు. గత సెప్టెంబర్లోనూ ₹923 కోట్లను ప్రభుత్వం ట్రూడౌన్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత నవంబర్ నుంచి <<17870164>>ట్రూడౌన్లో<<>> భాగంగా వినియోగదారులు ఉపయోగించే ఒక్కో యూనిట్పై 13 పైసలు తగ్గింపు ఇస్తున్నారు.


