News November 9, 2024

అరుదైన రోజు.. ఇవాళ దీపారాధన చేస్తే..

image

కార్తీకమాసంలో ఏ వారమైతే శ్రవణ నక్షత్రంతో వస్తుందో దాన్ని కోటి సోమవారంగా పేర్కొంటారని పండితులు చెబుతున్నారు. అదే ఈరోజు. శ్రవణ నక్షత్రం వేంకటేశ్వరస్వామి జన్మనక్షత్రం. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంటుంది. ఈరోజు ఉదయాన్నే దీపారాధాన చేస్తే తెలిసీతెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. కోటి శివలింగాలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈరోజు చేసే దానం, ఉపవాసాలకు కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని శాస్త్రవచనం.

Similar News

News January 17, 2026

NZB: నేడు మున్సిపల్ వార్డుల మహిళా రిజర్వేషన్ల ఖరారు

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని NZB నగరపాలక సంస్థతో పాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల వార్డులకు మహిళా రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు శనివారం డ్రా జరుపుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. దీని కోసం నిర్వహించే సమావేశానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ కోరారు.

News January 17, 2026

ఇతిహాసాలు క్విజ్ – 126

image

ఈరోజు ప్రశ్న: రావణుడు చనిపోతున్నప్పుడు లక్ష్మణుడు అతని దగ్గరకు వెళ్లి ఏం నేర్చుకున్నాడు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 17, 2026

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో పోస్టులు

image

ఢిల్లీలోని <>డిజిటల్<<>> ఇండియా కార్పొరేషన్ 9 టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గలవారు జనవరి 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/ B.Tech/ MCA, డిగ్రీ(CS/IT) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://dic.gov.in