News November 9, 2024
టికెట్ రేట్లు పెంచుకోవడానికే సీఎం కావాలా?: బండ్ల గణేశ్

TG: నిన్న CM రేవంత్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులకు బండ్ల గణేశ్ ధన్యవాదాలు తెలిపారు. విషెస్ చెప్పడానికి సమయం లేనివారికి ‘పెద్ద నమస్కారం’ అంటూ Xలో సెటైర్లు వేశారు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే CM కావలెను అంటూ రాసుకొచ్చారు. INC అగ్రనేతలు రాహుల్, ఖర్గే, ప్రియాంక ఎందుకు శుభాకాంక్షలు తెలపలేదని కొందరు, విషెస్ అడుక్కోవడం ఏందన్నా అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
Similar News
News September 14, 2025
కాంగ్రెస్ వల్లే విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి: హరీశ్ రావు

TG: రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడం సిగ్గుచేటని BRS MLA హరీశ్ రావు ఫైరయ్యారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. రీయింబర్స్‌మెంట్, ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా ప్రాజెక్టులకు ₹కోట్ల టెండర్లు ఎలా పిలుస్తున్నారని ప్రశ్నించారు. ఇలానే కొనసాగితే తక్కువ కాలంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన విద్యాశాఖ మంత్రిగానూ రేవంత్ నిలిచిపోతారన్నారు.
News September 14, 2025
రేపు డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్

AP: డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్టులను రేపు విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ తుది ఎంపిక జాబితాలు DEO, కలెక్టర్ కార్యాలయాల్లో, https://apdsc.apcfss.in/లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. కాగా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారికి ఈ నెల 19న అమరావతిలో అపాయింట్‌మెంట్ లెటర్లను అందజేయనున్నారు. 16,347 ఉద్యోగాలకు ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
News September 14, 2025
రేపు, ఎల్లుండి కలెక్టర్ల కాన్ఫరెన్స్

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రేపు, ఎల్లుండి కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. పౌరసేవలు, పథకాల అమలుపై జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ఈ కాన్ఫరెన్స్ జరుగుతుందని CM ఇప్పటికే వెల్లడించారు. తొలిరోజు వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల పురోగతితో పాటు సూపర్ సిక్స్ పథకాలు, అన్న క్యాంటీన్లు, P-4పై సమీక్షించనున్నారు. రెండో రోజు వైద్యం, క్వాంటం వ్యాలీ, మున్సిపల్, పంచాయతీరాజ్ అంశాలపై చర్చించనున్నారు.