News November 9, 2024
భారీ సెక్యూరిటీ మధ్య సల్మాన్ మూవీ షూటింగ్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భారీ సెక్యూరిటీ మధ్య ‘సికందర్’ మూవీ షూట్‌లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ హోటల్‌లో చిత్రీకరిస్తున్నారు. ఎన్ఎస్‌జీ కమాండోలు, పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులందరూ దాదాపు 70 మంది ఆయనకు భద్రత కల్పిస్తున్నారు. మొత్తం 4 అంచెల రక్షణ ఏర్పాటు చేశారు. కాగా సల్మాన్‌కు ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుస బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News February 2, 2026
పెళ్లి కాదు పనే ముఖ్యం: బాస్

కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పే ఓ ఘటన SMలో వైరలవుతోంది. ‘నా ఎంగేజ్మెంట్ 2 నెలల క్రితమే చెప్పాను. ఆ విషయాన్ని గాలికొదిలేసి ఇప్పుడు ఎంగేజ్మెంట్ ముఖ్యం కాదు వీకెండ్ కూడా పని చేయమంటున్నారు. ఇక్కడ చేసే వారికంటే పని చెప్పేవారు ఎక్కువ. గంటలు గంటలు జూమ్ కాల్స్ మాట్లాడాలి. నేను ఈ ప్రాజెక్టులో కొనసాగలేను. నా పెళ్లి కూడా వాయిదా వేసుకోలేను’ అని ఆవేదనను వ్యక్తం చేశారు.
News February 2, 2026
మ్యాడ్ సిరీస్‌లో క్రేజీ యాక్టర్స్!

యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్స్‌గా హిట్లు అందుకున్న ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సిరీస్‌లో మూడో సినిమా రాబోతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మ్యాడ్ జూనియర్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో లిటిల్ హార్ట్స్ ఫేమ్ జై కృష్ణ, కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని సినీ వర్గాలు వెల్లడించాయి.
News February 2, 2026
లా అండ్ ఆర్డర్ సమస్య తేవాలని YCP చూస్తోంది: చంద్రబాబు

AP: రాష్ట్రంలో లా & ఆర్డర్ సమస్య తేవాలని YCP చూస్తోందని CM CBN విమర్శించారు. తాజా ఘటనలపై ఆయన TDP నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘TTD లడ్డూ వ్యవహారంలో దొరికిపోయిన YCP దాన్ని దారిమళ్లించేందుకు బూతులు ఎత్తుకుంది. TDPని రెచ్చగొట్టి అలజడి సృష్టించాలని చూస్తోంది. ఆ ట్రాప్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలు పడొద్దు. రాష్ట్రంలో ఎంతో అభివృద్ది జరుగుతోంది. అన్ని వర్గాలూ సంతోషంగా ఉన్నాయి’ అని వివరించారు.


