News November 9, 2024

సర్వే కోసం వెళ్తే.. కుక్కలను ఉసిగొల్పుతున్నారు..!

image

TG: సమగ్ర కుటుంబ సర్వే కోసం వెళ్లిన ఎన్యూమరేటర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. HYD బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో కొందరు ఇళ్ల యజమానులు సర్వే కోసం వెళ్లిన ఎన్యూమరేటర్లపైకి కుక్కలను ఉసిగొల్పి బెదిరింపులకు దిగారు. అరోరా కాలనీలో నివసించే మరో మహిళ వారిపై దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. మరికొందరు తలుపులు తీయడం లేదని, వ్యక్తిగత వివరాలు మీకెందుకు చెప్పాలని ప్రశ్నిస్తున్నట్లు వారు వాపోయారు.

Similar News

News January 14, 2026

ఊల వేసిన మడిలో నీరుంటుందా?

image

పూర్తిగా పొడిబారిన లేదా ఇసుకతో కూడిన భూమి నీరు త్వరగా ఇంకిపోయే గుణం కలిగి ఉంటుంది. ఆ నేలలో లేదా మడిలో నీరు పోసిన వెంటనే ఇంకిపోతుంది తప్ప, నిలబడి ఉండదు. అలాగే ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత జ్ఞానం బోధించినా, గ్రహించే బుద్ధిలేని వ్యక్తికి అవి ఏమాత్రం ఉపయోగపడవు. ఊల మడిలో వేసిన నీరులాగే ఇంకిపోతాయి. మంచి సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించే మనస్తత్వం లేని వారి గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

News January 14, 2026

‘సంక్రాంతి’ అంటే ఏంటో మీకు తెలుసా?

image

సంక్రాంతి అంటే సూర్యుడు ఓ రాశి నుంచి మరొక రాశిలోకి మారడం. ఇది ‘శంకర’ అనే పదం నుంచి వచ్చిందని అంటారు. శంకర అంటే కదలిక. ప్రాణం ఉంటేనే కదలిక ఉంటుందని, గ్రహాల గమనం వల్లే సృష్టి నడుస్తుందని దీనర్థం. సంస్కృతంలో ‘సం’ అంటే మంచి, ‘క్రాంతి’ అంటే మార్పు. సూర్యుడు ప్రతి నెలా రాశి మారుతున్నా, ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ‘మకర సంక్రాంతి’ని మనం పెద్ద పండుగగా జరుపుకుంటాం. ఈ మార్పు అభ్యుదయానికి సంకేతం.

News January 14, 2026

ఉదయాన్నే అలసటగా అనిపిస్తుందా?

image

ఉదయం నిద్రలేవగానే శరీరం బరువుగా, అలసటగా అనిపిస్తే అది నిర్లక్ష్యం చేయాల్సిన విషయం కాదు. నిద్ర సరిపోకపోవడం, శరీరంలో నీరు తగ్గడం, విటమిన్-D లోపం, మానసిక ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వంటివి ఇందుకు కారణమవుతాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రోజూ గోరువెచ్చని నీరు తాగడం, సరైన నిద్ర, ఉదయం ఎండలో కూర్చోవడం, వ్యాయామం అలవాటు చేసుకోవాలి. అయినా అలసట తగ్గకపోతే వైద్య సలహా తప్పనిసరి.