News November 9, 2024
తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదం

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం చెలరేగింది. నాగార్జున సాగర్ వద్ద ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఘర్షణ చెలరేగింది. సాగర్ కెనాల్ రీడింగ్ కోసం వెళ్లిన తెలంగాణ సిబ్బందిని ఏపీ అధికారులు అడ్డుకున్నారు. తెలంగాణ అధికారులకు ఇక్కడేం పని అంటూ వారు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Similar News
News November 16, 2025
లైటింగ్ పెంచడంతోనే పేలుడు!

J&K నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన <<18295101>>పేలుడుకు<<>> అధిక లైటింగే కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ‘ఫరీదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్ కేసులో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల్లో ద్రవరూప రసాయనాలు కూడా ఉన్నాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఫోరెన్సిక్ బృందాలు లైటింగ్ పెంచాయి. దీంతో వెలువడిన వేడి లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి వచ్చిన పొగలు ఆ రసాయనంతో కలిసి పేలుడు జరిగి ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.
News November 16, 2025
ధర్మబద్ధంగా జీవించడమే స్వర్గానికి మార్గం

బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం|
లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవమ్||
అన్ని ధర్మాలు తెలిసిన, మనందరికీ కీర్తిని, అభివృద్ధిని ఇచ్చే ప్రపంచ నాయకుడు, గొప్పవాడు, సకల జీవరాశికి పుట్టుకకు, ఉనికికి మూలమైనవాడు విష్ణుమూర్తి. ఆయన బోధించిన ధర్మాన్ని మనం మన జీవితంలో పాటించాలి. సకల సృష్టికి మూలమైన ఆయనను స్మరిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తే స్వర్గానికి మార్గం సుగమం అవుతుందని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 16, 2025
IND vs PAK.. మరోసారి ‘నో హ్యాండ్ షేక్’

ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నీలో భాగంగా దోహాలో ఇండియా-A, పాకిస్థాన్-A మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ సమయంలో పాక్ కెప్టెన్‌కు భారత కెప్టెన్ జితేశ్ శర్మ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఆసియా కప్ నుంచి ఇది కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుత మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన IND-A 19 ఓవర్లలో 136 రన్స్‌కి ఆలౌటైంది. వైభవ్(45), నమన్(35) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు.


