News November 9, 2024

ఐదేళ్ల విధ్వంసాన్ని చక్కబెడుతున్నాం: చంద్రబాబు

image

AP: ఎన్డీఏను గెలిపించి రాష్ట్రానికి ప్రజలు ఆక్సిజన్ ఇచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్ల విధ్వంసాన్ని చక్కబెడుతున్నామని తెలిపారు. ‘అన్ని రంగాల్లో టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు సాగుతాం. సముద్రం, నది ఎక్కడున్నా సీ ప్లేన్ సర్వీసులు ఏర్పాటు చేయొచ్చు. టూరిజం అభివృద్ధికి మనకు అన్ని వనరులున్నాయి. APలో హాస్పిటాలిటీని మెరుగుపరుస్తాం’ అని VJAలో సీప్లేన్ సర్వీస్ ప్రారంభోత్సవంలో చంద్రబాబు అన్నారు.

Similar News

News December 26, 2024

సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్?

image

ట్యాక్స్ పేయర్స్‌కి ఊరట కలిగించేలా 2025 బ‌డ్జెట్‌లో కేంద్రం నిర్ణ‌యాలు ఉంటాయ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. 2020లో తెచ్చిన ప‌న్ను విధానం కింద ₹3.5 లక్షల- ₹10.50 ల‌క్ష‌ల ఆదాయానికి 5-20%, ఈ మొత్తానికి మించితే 30% ప‌న్ను చెల్లించాల్సి వ‌స్తోంది. ప్ర‌స్తుతం దేశం అర్థిక స‌వాళ్లు ఎదుర్కొంటుండడం, పెరుగుతున్న జీవ‌న వ్య‌యాల నేప‌థ్యంలో Tax Payersకి ఊర‌ట క‌లిగించేలా Budgetలో నిర్ణ‌యాలుంటాయ‌ని స‌మాచారం.

News December 26, 2024

మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్: రాహుల్ గాంధీ

image

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జ‌రిగిందంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నిక‌ల‌కు ముందు 118 నియోజ‌క‌వ‌ర్గాల్లో 72 ల‌క్ష‌ల ఓట్ల‌ను జోడించార‌ని, అందులో 102 చోట్ల BJP విజ‌యం సాధించింద‌న్నారు. LS ఎన్నిక‌ల త‌రువాత AS ఎన్నిక‌ల‌కు ముందు ఈ అక్ర‌మాలు జరిగినట్టు వివ‌రించారు. అయితే, ఏక‌ప‌క్షంగా ఓట‌ర్ల తొల‌గింపు, కొత్త ఓట‌ర్లను చేర్చ‌డం సాధ్యంకాద‌ని ఇటీవ‌ల EC వివ‌ర‌ణ ఇవ్వ‌డం తెలిసిందే.

News December 26, 2024

టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్

image

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వన్డే ఫార్మాట్‌లోకి అడుగుపెడుతున్నారు. త్వరలో జరగబోయే విజయ్ హజారే ట్రోఫీలో ఆయన ఆడనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ఆయన అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. కాగా హార్దిక్ వన్డేలు ఆడక ఏడాది దాటిపోయింది. వన్డే వరల్డ్ కప్ 2023లో గాయపడినప్పటి నుంచి ఆయన ఈ ఫార్మాట్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో హార్దిక్ వన్డేలపై దృష్టి సారించారు.