News November 9, 2024
టీసీ వరుణ్‌కు వరించిన అహుడా ఛైర్మన్ పదవి

కూటమి ప్రభుత్వం ఏపీలో 59 మందికి నామినేటెడ్ పదవులను ప్రకటించింది. ఇందులో భాగంగానే అనంతపురానికి చెందిన టీసీ వరుణ్‌కు నామినేటెడ్ పదవి దక్కింది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌కు అహుడా ఛైర్మన్ పదవిని కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జనసేన నాయకులు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 21, 2026
రైతుల పాలిట కనక వర్షంగా మారిన దానిమ్మ పంట

అనంతపురం జిల్లాలో పండిస్తున్న దానిమ్మ పంట రైతుల పాలిట కనక వర్షం కురిపిస్తోంది. కొంతకాలంగా గిట్టుబాటు ధరలు లేక రైతులు పడిన ఇబ్బందులు అన్నీఇన్ని కావు. నేడు నాణ్యతను బట్టి టన్ను దాదాపు రూ.1.50 లక్షలకు పైగా వ్యాపారులు తోటల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. పుట్లూరు మండలం బాలాపురంలో రైతు సుదర్శన్ రెడ్డికి చెందిన తోటలో ఒక్కో దానిమ్మ కాయ 0.830 గ్రాముల బరువు దిగుబడి రావడం విశేషం.
News January 20, 2026
ఇన్‌ఛార్జి కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు

అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ బదిలీ కావడంతో రెవెన్యూ భవనంలో మంగళవారం రాత్రి ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. రెవెన్యూ శాఖ, జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన సేవలను పలువురు కొనియాడారు. జిల్లా అభివృద్ధి, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ అభినందనీయమన్నారు. అధికారుల అభినందనల మధ్య ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.
News January 20, 2026
జేఎన్‌టీయూ-ఏ ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలో నిర్వహించిన M.Tech (R21), M.Sc (R21) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ శివకుమార్ ఈ ఫలితాలను ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం www.jntuaresults.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.


