News November 9, 2024
రెండో టెస్టులోనూ ఇండియా ఓటమి

ఆస్ట్రేలియా Aతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో ఇండియా A ఘోర పరాజయం పాలైంది. 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఆస్ట్రేలియా చిత్తు చేసింది. సామ్ కాన్స్టాస్ (73*) రాణించడంతో ఆ జట్టు విజయం సాధించింది. తొలి ఓవర్లోనే ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీసి ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టినా కాన్స్టాస్ నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చారు. కాగా తొలి అనధికారిక టెస్టులో కూడా ఇండియా A 7 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.
Similar News
News November 7, 2025
బాలీవుడ్ నటి సులక్షణ కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ నటి, సింగర్ సులక్షణా పండిట్(71) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ అంత్యక్రియలు నిర్వహిస్తామని సోదరుడు లలిత్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లో సంగీత విద్వాంసుల కుటుంబంలో ఈమె జన్మించారు. తొలుత సింగర్‌గా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ‘సంకల్ప్’ మూవీలో పాటకు ఫిలింఫేర్ అందుకున్నారు. ఆ తర్వాత సంజీవ్ కుమార్, రాజేశ్ ఖన్నా, జితేంద్ర, శత్రుఘ్నసిన్హా వంటి ప్రముఖుల సరసన నటించారు.
News November 7, 2025
దాతృత్వంలో శివ్ నాడార్ అగ్రస్థానం

ఈ ఏడాది అత్యధిక విరాళాలు అందించిన వారి జాబితాలో శివ్ నాడార్(HCL టెక్నాలజీస్) ఫ్యామిలీ అగ్రస్థానంలో నిలిచింది. వారు ₹2,708Cr విరాళం ఇచ్చినట్లు ఎడెల్‌గివ్ హురున్ వెల్లడించింది. గత ఐదేళ్లలో 4సార్లు ఆయన టాప్‌లో నిలిచారు. తర్వాతి స్థానాల్లో ముకేశ్(₹626Cr), బజాజ్(₹446Cr), బిర్లా(₹440Cr), అదానీ(₹386Cr), నందన్(₹365Cr), హిందూజ(₹298Cr), రోహిణి(₹204Cr) ఉన్నారు. మొత్తంగా 191 మంది కుబేరులు ₹10,380Cr ఇచ్చారు.
News November 7, 2025
విద్యార్థులు తప్పక ఉచ్ఛరించాల్సిన 12 నామాలు

1.ఓం భారతి నమ:, 2.ఓం సరస్వతి నమ:,
3.ఓం శారదే నమ:, 4.ఓం హంసవాహినియే నమ:,
5.ఓం జగతే నమ:, 6.ఓం వాగేశ్వరి నమ:,
7.ఓం కుముదినే నమ:, 8.ఓం బ్రహ్మచారిణే నమ:,
9.ఓం బుద్ధిదాత్రే నమ:, 10.ఓం చంద్రకాంతే నమ:,
11.ఓం వార్దాయని నమ:, 12.ఓం భువనేశ్వరి నమ:
విద్యార్థులు రోజు ఉదయాన్నే స్నానం చేసి ఈ 12 నామాలను ఉచ్ఛరిస్తే జ్ఞానం, తెలివితేటలు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, విద్య, కళలు, సృజనాత్మకత పెరుగుతాయని నమ్మకం.


