News November 9, 2024
భద్రాచలం టెంపుల్ వసతి గృహం నుంచి పడి మృతి

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వసతి గృహం భవనం నుంచి కిందకు పడి ఓ భక్తుడు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. సీఆర్ఓ కార్యాలయం సమీపంలోని రామాసదనంపై అంతస్తు నుంచి చెన్నైకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలతో మరణించినట్లు స్థానికులు చెప్పారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News January 23, 2026
ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధం: కలెక్టర్

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ‘నా భారతదేశం – నా ఓటు’ అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
News January 23, 2026
సహాయక పరికరాలకు దివ్యాంగుల దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు సహాయక పరికరాల కోసం ఈ నెల 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత కోరారు. ఆసక్తి గలవారు సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు తదితర ధ్రువపత్రాలతో ప్రభుత్వం సూచించిన వెబ్‌సైట్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లావ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 23, 2026
కల్లూరు: గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రమాదం.. ఆప్డేట్

కల్లూరు మండలంలోని లింగాల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై శుక్రవారం <<18932335>>రోడ్డు <<>>ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎస్ఐ హరిత వివరాల ప్రకారం.. ఏపీలోని చింతలపూడి మండలానికి చెందిన గట్టు రాంబాబు, కొమ్ము సాయి బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి హైవే రైలింగ్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


