News November 9, 2024
విశాఖ నడిబొడ్డున గంజాయి సాగు

AP: మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో సాగయ్యే గంజాయి విశాఖ నడిబొడ్డుకు చేరింది. కింగ్‌జార్జ్ హాస్పిటల్(KGH) కొండ ప్రాంతంలోని లేడీస్ హాస్టల్ వెనుక దుండగులు గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని పండించి విద్యార్థులకు అమ్ముతున్నారు. వైజాగ్ నేవీ కంట్రోల్‌లో ఉండే ఈ చోట గంజాయి సాగు కొనసాగుతుండటంతో పోలీసులు షాకయ్యారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 7, 2026
వీటిపై USలో జీరో టారిఫ్స్

ట్రేడ్ డీల్‌తో అమెరికాలో భారత వస్తువులపై 18% సుంకాలు వర్తించనున్నాయి. అయితే కొన్నింటిపై 0% డ్యూటీ కూడా ఉన్నట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు. అవి.. జెమ్స్, డైమండ్స్, ఫార్మా, విమాన పరికరాలు, స్మార్ట్‌ఫోన్లు, స్పైసెస్, టీ, కాఫీ, కొబ్బరి, కొబ్బరి నూనె, వక్కలు, బ్రెజిల్ నట్స్, జీడిపప్పు, చెస్ట్ నట్స్, వెజిటెబుల్ వ్యాక్స్, అవకాడో, అరటి, మామిడి, పైనాపిల్, పుట్ట గొడుగులు, బేకరీ ప్రొడక్ట్స్.
News February 7, 2026
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

నేపాల్ యాక్టర్ సునీల్ థాపా(68) కన్నుమూశారు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో కాఠ్‌మాండూ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 40 ఏళ్ల కెరీర్‌లో 300కి పైగా నేపాలీ, బాలీవుడ్, భోజ్‌పురి సినిమాల్లో నటించారు. హిందీలో ‘మేరీ కోమ్’, తెలుగులో ‘మిరాయ్’ మూవీలోనూ కనిపించారు. ఆయన మృతిపై సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News February 7, 2026
దేశంలో ముస్లిం జనాభా హిందువులను దాటదు: అసదుద్దీన్

దేశంలో హిందూ జనాభాను ముస్లింలు ఎప్పటికీ అధిగమించలేరని MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. ముస్లిం జనాభా స్టెబిలైజ్ అవుతుందన్నారు. ‘20 ఏళ్ల తర్వాత వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. కానీ ద్రవ్యోల్బణం, ఇతర అంశాలపై ఆలోచించకుండా ముస్లిం జనాభా ఎక్కువవుతోందని గతంలో కొందరు అన్నారు. వృద్ధుల సంఖ్య పెరిగితే దేశంపై ఎంత ప్రభావం పడుతుందనేది ఇప్పుడు తెలుసుకుంటున్నారు. పిల్లల్ని కనాలని చెబుతున్నారు’ అని విమర్శించారు.


