News November 9, 2024

అధికారంలోకి వచ్చాక పోలీసులకు వడ్డీతో చెల్లిస్తాం: కేటీఆర్

image

TG: దళిత బంధు ఇవ్వాలని అడిగితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేస్తారా? అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యమంటే ప్రశ్నిస్తే దాడి చేయడమా అని మండిపడ్డారు. పాలకుల వద్ద మెప్పు పొందేందుకు పోలీసులు పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో చెల్లిస్తామని హెచ్చరించారు. మరోవైపు కౌశిక్ రెడ్డిపై సీఎం రేవంత్ కక్ష పెంచుకున్నారని విమర్శించారు.

Similar News

News January 14, 2025

Way2News: 24 గంటలూ వార్తల ‘పండుగే’

image

‘ఈరోజు సంక్రాంతి సెలవు కారణంగా రేపు పేపర్ రాదు. పునర్దర్శనం గురువారం’ అని వార్తాపత్రికల్లో చదువుతుంటాం. ఈరోజు వార్తలను చదివేందుకు మీరు మరుసటి రోజు వరకు వేచిచూడాల్సిన పని లేదు. ఎప్పటిలాగే పండుగ నాడు కూడా Way2News ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. సెలవుల్లోనూ 24/7 బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, సినిమాలు, స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ కంటెంట్ వస్తూనే ఉంటాయి.
*Way2News యూజర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు

News January 14, 2025

నేడు మకరజ్యోతి దర్శనం

image

నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనమివ్వనుంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండడంతో కేరళ ప్రభుత్వం అదనపు భద్రతా సిబ్బందిని మోహరించింది. జ్యోతిని దర్శించుకునే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. జ్యోతి దర్శనం సాయంత్రం 6-7 గంటల మధ్య జరగనుంది. దీని కోసం లక్ష మందికిపైగా అయ్యప్ప భక్తులు వస్తారని అంచనా.

News January 14, 2025

స్టేషన్‌లోనే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అర్ధరాత్రి కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. స్టేషన్‌లోనే ఆయనకు బస ఏర్పాటు చేయగా ఉదయాన్నే వైద్య పరీక్షలు నిర్వహించారు. 9 గంటలకు కరీంనగర్ రెండవ అదనపు జుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరుపరచనున్నారు. మరోవైపు కౌశిక్ అరెస్టును బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు.