News November 9, 2024
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలి: భట్టి

సమగ్ర కుటుంబ సర్వే నమోదు ప్రక్రియ పకడ్బందీగా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సర్వేపై భట్టి ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇంటింటి సమగ్ర సర్వే నేపథ్యంలో ప్రజలకు అనేక సందేహాలు వస్తుంటాయని, వాటిని నివృత్తి చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా ఎన్యూమరేటర్లు కలెక్టర్ల దృష్టికి తేవాలని పేర్కొన్నారు.
Similar News
News December 31, 2025
ఒక్క క్లిక్‌తో వీధి దీపాలు.. ఖమ్మం కార్పొరేషన్ కొత్త ప్రయోగం

ఖమ్మం నగర పాలక సంస్థలో విద్యుత్ ఆదా, మెరుగైన సేవల కోసం కమిషనర్ అభిషేక్ ఆగస్త్య’CCMS’ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. నగరంలోని 26,842 వీధి దీపాలను మొబైల్ యాప్ లేదా కంప్యూటర్ ద్వారా నియంత్రించవచ్చు. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో ఇవి వాటంతట అవే ఆరిపోవడం, వెలగడం జరుగుతుంది. దీనివల్ల నెలకు సుమారు రూ.40 లక్షల విద్యుత్ బిల్లు ఆదా అవ్వడమే కాకుండా, మరమ్మతులను కార్యాలయం నుంచే పర్యవేక్షించే వీలుంటుంది.
News December 31, 2025
ఖమ్మం: MRO, కార్యదర్శిపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు

ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారనే ఆరోపణలపై పెనుబల్లి MRO శ్రీనివాస్ యాదవ్, చింతగూడెం సెక్రటరీ రవిలను కలెక్టర్ సస్పెండ్ చేశారు. సుమారు రూ.5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా బదలాయించారని వీరిపై అభియోగాలు ఉన్నాయి. గత 15 రోజులుగా ఈ వ్యవహారంపై వెల్లువెత్తిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్ ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ విషయం ఇప్పుడు మండలంలో చర్చనీయాంశమైంది.