News November 9, 2024
1520 ఉద్యోగాలపై BIG ALERT

TG: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో 1,520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన అప్‌డేట్‌ను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. డిసెంబర్ 29న CBT విధానంలో పరీక్ష ఉంటుందని పేర్కొంది. గతంలో విడుదలైన నోటిఫికేషన్‌కు దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తైంది. అటు రేపు జరిగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించింది.
Similar News
News February 16, 2026
BREAKING: తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర కాస్త తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,310 తగ్గి రూ.1,56,440కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 పతనమై రూ.1,43,400 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 16, 2026
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 140+ పాయింట్ల లాభంతో 82,768 వద్ద కదలాడుతోంది. అటు నిఫ్టీ సైతం 42 పాయింట్ల లాభంతో 25,515 వద్ద ఊగిసలాడుతోంది.
News February 16, 2026
మొక్కజొన్న: ఎరువుల యాజమాన్యం, తెగుళ్ల నివారణ

☛ పూత దశలో మొక్కజొన్న పంటకు 50KGల యూరియా, 20KGల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసి, నీటి తడిని ఇవ్వాలి. ☛ పేను బంక ఆశిస్తే డైమిథోయేట్ 30EC 2 ML లీటరు నీటికి, ఆకుమచ్చ, ఆకు మాడు తెగుళ్లు ఆశిస్తే 2.5గ్రా. మ్యాంకోజెబ్/1మి.లీ ప్రొపికొనజోల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ☛ కాండం కుళ్లు తెగులు కనిపిస్తే 100KGల వేప పిండి, 4KGల 35% క్లోరిన్ కలిగిన బ్లీచింగ్ పౌడర్‌ను కలిపి మొక్కల మొదళ్ల దగ్గర వేయాలి.


