News November 9, 2024
కులగణనకు బీజేపీ అనుకూలమేనా?: పొన్నం

TG: కులగణనకు బీజేపీ అనుకూలమా? కాదా? చెప్పాలని ఎంపీ లక్ష్మణ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. ఎన్నికలు ముగిశాకే ఈ కార్యక్రమం చేపట్టామని బీజేపీ గ్రహించాలని హితవు పలికారు. కులగణనకు వ్యతిరేకంగా బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలా? వద్దా? అని ప్రశ్నించారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ అని పేర్కొన్నారు.
Similar News
News January 23, 2026
పెరటి కోళ్ల పెంపకం.. ఈ జాతులతో అధిక ఆదాయం

కోళ్ల పెంపకం నేడు ఉపాధి మార్గంగా మారింది. మేలైన జాతి రకాలతో మంచి ఆదాయం సాధించవచ్చు. పెరటి కోళ్ల పెంపకానికి స్వర్ణధార, గ్రామ ప్రియ, శ్రీనిధి రకాలతో మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇవి అధిక మాంసోత్పత్తి, గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెంది, ఎక్కువ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. ఈ కోళ్ల జాతులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.
News January 23, 2026
భాగ్యనగరానికి మరో ‘అమృత్ భారత్’.. రూట్ మ్యాప్ ఇదే!

TG: చర్లపల్లి – తిరువనంతపురం మధ్య కొత్త అమృత్ భారత్ 2.0 ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. PM మోదీ శుక్రవారం దీన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ ప్రతి మంగళవారం ఉదయం 7.15కి చర్లపల్లిలో బయలుదేరి బుధవారం మధ్యాహ్నం కేరళ చేరుకుంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. అమృత్ భారత్‌లో RAC టికెట్లు ఉండవు.
News January 23, 2026
పెరటి కోళ్ల పెంపకం.. స్వర్ణధార కోళ్ల ప్రత్యేకత ఇదే

స్వర్ణధార కోళ్లు కూడా పెరటి కోళ్ల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి అధిక శరీర బరువును కలిగి ఉంటాయి. ఏడాదికి 190 వరకు గుడ్లను పెడతాయి. గుడ్లు, మాంసం ఉత్పత్తి కోసం ఎక్కవ మంది పెరటి కోళ్ల పెంపకానికి స్వర్ణధార కోళ్లను ఎంపిక చేసుకుంటారు. ఇవి 22 నుంచి 23 వారాల్లో సుమారు 3 నుంచి 4 కిలోల బరువు పెరుగుతాయి. వీటి గుడ్డు బరువు 50-60 గ్రాములుంటుంది. స్వర్ణధార కోళ్లకు గుడ్లు పొదిగే సామర్థ్యం 80-85%గా ఉంటుంది.


