News November 9, 2024
మిర్చి తోటకు దిష్టి తగలకుండా రైతు వినూత్న ఆలోచన

జూలూరుపాడు తాను సాగు చేస్తున్న మిర్చి తోటకు దిష్టి తగలకూడదని ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. కాకర్ల గురువాగుతూ క్రాస్ రోడ్డు వద్ద ఓ రైతు తన మిర్చి తోటలో ఓ సినీనటి బ్యానర్ ను ఏర్పాటు చేశాడు. ఇలా బ్యానర్ ఏర్పాటు చేయడం వల్ల మిర్చి తోటకు రోడ్డుపై వెళ్లే పలువురు దిష్టి తగలకుండా మంచిగా సాగు అవుతుందని ఆ రైతు అంటున్నాడు.
Similar News
News January 5, 2026
పాక్షికంగా అందుబాటులోకి ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే పనులు తుది దశకు చేరుకోవడంతో వచ్చే నెలలో వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు రాకపోకలను పాక్షికంగా ప్రారంభించేందుకు NHAI సిద్ధమవుతోంది. హైదరాబాద్-వైజాగ్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ రహదారిలో మధ్య సెక్షన్ పూర్తవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త మార్గం వల్ల పాత రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి.
News January 4, 2026
ఖమ్మం: 150 మంది డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు

రవాణా మాసోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య, కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 150 మంది డ్రైవర్లు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. ఎంవీఐలు దినేష్, సుమలత, రవిచందర్, వైద్యులు గౌతమ్, నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డ్రైవర్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమని అధికారులు పేర్కొన్నారు.
News January 4, 2026
ఖమ్మం: సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా కళ్యాణం వెంకటేశ్వర్లు

సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా ఖమ్మం నగరానికి చెందిన కళ్యాణం వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. డిసెంబర్ 31వ తేదీ నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరిగిన సీఐటీయూ జాతీయ మహాసభల్లో ఎన్నిక నిర్వహించారు. ప్రస్తుతం ఆయన సీఐటీయూ ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.


