News November 9, 2024

36 గంటల్లో అల్పపీడనం.. భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో రాబోయే 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA తెలిపింది. దీంతో మంగళ, బుధ వారాల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో వరికోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Similar News

News November 13, 2025

ఇస్రో షార్‌లో 141 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

<>ఇస్రో <<>>సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో 141 టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మన్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, BSc, డిప్లొమా, ITI, టెన్త్, MSc, BE, బీటెక్, ME, ఎంటెక్, BLSc, నర్సింగ్ డిప్లొమా ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://www.isro.gov.in/

News November 13, 2025

ఇవాళ ఈ జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు బంద్

image

TG: విద్యార్థి సంఘాల భౌతిక దాడులను నిరసిస్తూ ఇవాళ ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల బంద్‌కు WADUPSA పిలుపునిచ్చింది. HNK, వరంగల్, BHPL, జనగాం, ములుగు, MHBD జిల్లాల్లోని ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు బంద్ పాటించాలని కోరింది. విద్యార్థి సంఘాల నాయకులు చందాలకు వెళ్లి స్కూల్ యాజమాన్యంపై దాడికి దిగడంపై హనుమకొండ PSలో ఫిర్యాదు చేసింది. ఈ చందాల దందా నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేసింది.

News November 13, 2025

నేటి నుంచి సత్యసాయి శతజయంతి వేడుకలు

image

AP: నేడు పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఏటా NOV 18 నుంచి ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ కాగా శతజయంతి కావడంతో ఐదు రోజుల ముందు నుంచే నిర్వహిస్తున్నారు. ఇవాళ ప్రశాంతి నిలయంలో నారాయణ సేవను ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో 19న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, 22న ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, 23న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్సవాల్లో పాల్గొంటారు.