News November 9, 2024

నెల్లికుదురులో రెండు తలలతో జన్మించిన గొర్రె పిల్ల

image

రెండు తలలతో గొర్రె పిల్ల జన్మించిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. నెల్లికుదురు గ్రామానికి చెందిన కావటి పిచ్చయ్య యాదవ్‌కు చెందిన గొర్రెల మందలో ఒక గొర్రెకు రెండు తలలతో వింత గొర్రె పిల్ల పుట్టింది. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు తండోపతండాలుగా వచ్చి దానిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా ఇది జన్యులోపమని పలువురు పేర్కొన్నారు. 

Similar News

News March 3, 2026

ప్రభుత్వాసుపత్రిలో సమయపాలన పాటించాలి: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలోనీ ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి, డాక్టర్లు సమయపాలన పాటించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలని కలెక్టర్ డా.సత్య శారద హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, సూపరిండెంటెంట్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

News February 28, 2026

వరంగల్: ఇంటర్ పరీక్షలకు 212 మంది గైర్హాజరు

image

జిల్లాలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో విద్యార్ధుల గైర్హాజరు కలవర పెడుతోంది. ఒకే రోజులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పరీక్షకు 5,179 మందిలో 143 మంది, ఒకేషనల్ కోర్సుకు 823 మందిలో 69 మంది గైర్హాజరైనట్లు డీఈవో రంగయ్య నాయుడు తెలిపారు. మొత్తం 212 మంది హాజరు కాలేదన్నారు. పరీక్షల నిర్వహణలో పరీక్ష నిర్వాహకులుగా మాధవరావు, బండి విజయనిర్మల పూర్తి స్థాయిలో పర్యవేక్షించినట్లు వెల్లడించారు.

News February 28, 2026

మత్తు పదార్థాల విక్రయదారులను కనిపెట్టాలి: కలెక్టర్

image

పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్య శారద పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా నార్కోటిక్ కమిటీ సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఆమె సమీక్షించారు. విద్యాసంస్థల ప్రాంగణాల్లో మాదక ద్రవ్యాల రవాణా జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.