News November 9, 2024
ట్రంప్‌ను గెలిపించారని పురుషులతో శృంగారానికి నో!

అమెరికాలో ట్రంప్ గెలవడం పురుషులపై మహిళల కోపానికి కారణమైంది. అబార్షన్‌లు, ఇతర హక్కుల విషయంలో ట్రంప్ వైఖరిని మహిళలు ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నారు. తాజాగా పురుషుల ఓట్ల వల్లే ట్రంప్ గెలిచారని భావిస్తూ వారితో పెళ్లి, శృంగారం, పిల్లలు వంటి బంధాలు పెట్టుకోమని కొందరు మహిళలు ఉద్యమిస్తున్నారు. అయితే ఇది సోషల్ మీడియా ట్రెండ్ అని, ఉద్యమం కాదని మరికొందరు అంటున్నారు.
Similar News
News February 17, 2026
ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు షాక్!

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన కంపోజ్ చేసిన దాదాపు 134 సినిమాలకు సంబంధించిన సౌండ్ రికార్డింగ్స్, మ్యూజిక్ వాడటంపై తాత్కాలికంగా ఆంక్షలు విధించింది. సరిగమ సంస్థ వద్ద వాటి హక్కులు ఉండటమే కారణం. ఇళయరాజా వీటిని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్ చేయడంపై ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. కాగా ఇప్పటికే ఓ తమిళపాట కాపీరైట్ హక్కులపై వీరి మధ్య పోరు నడుస్తోంది.
News February 17, 2026
నా దగ్గర అంత డబ్బు లేదు: మస్క్

ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ ఈ ఏడాది ట్రిలియనీర్ అయ్యే ఛాన్స్ 75%పైనే ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందిస్తూ.. తన వద్ద 0.1% కంటే తక్కువ డబ్బు ఉందన్నారు ఎలాన్ మస్క్. ఎక్కువ భాగం టెస్లా, స్పేస్ఎక్స్ వాటాల్లోనే ఉందన్నారు. టెస్లాలో 80%పైగా షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లవేనని తెలిపారు. ప్రస్తుతం మస్క్ సంపద $849.3B కాగా xAI, స్పేస్ఎక్స్ మెర్జ్‌తో ట్రిలియన్ మార్క్ టచ్ కానుందని అంచనా.
News February 17, 2026
కర్తరీ దోషం ఎలా ఏర్పడుతుంది?

ఖగోళ గమనం ప్రకారం.. సూర్యుడు మే నెలలో మేష->వృషభ రాశిలోకి కృత్తికా నక్షత్రం గుండా ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి సూర్యుడు రోహిణి నక్షత్రం దాటే వరకు ఉన్న సమయాన్ని కర్తరీగా గణిస్తారు. దీనిని 2 రకాలుగా విభజిస్తారు. సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ఉన్నప్పుడు ‘చిన్న కర్తరీ’, మిగిలిన పాదాల్లో సంచరించేటప్పుడు ‘పెద్ద కర్తరీ’ ఏర్పడుతుంది. ఈ గ్రహ స్థితి వల్ల భూమిపై వేడి గాలులు పెరుగుతాయి.


