News November 10, 2024
ఈరోజు నమాజ్ వేళలు

✒ తేది: నవంబర్ 10, ఆదివారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5:04 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6:19 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4:05 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 5:42 గంటలకు ✒ ఇష: రాత్రి 6.56 గంటలకు నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News March 19, 2026
జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: కలెక్టర్

సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన తెలుగు సంవత్సరం ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఉగాది కొత్త ఆశలు, లక్ష్యాలకు శ్రీకారమని పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ, ప్లాస్టిక్ రహితంగా, పరిశుభ్రమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
News March 19, 2026
జగిత్యాల: జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాల్లో కాంగ్రెస్ అధిష్ఠానం.!

మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి సుమారు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు వచ్చినట్లు ఆయన తెలిపారు. జీవన్ రెడ్డి 40 ఏళ్ల అనుభవం కలిగిన నాయకులని, పార్టీ ఆయనను వదులుకోదని, చర్చించిన అంశాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
News March 19, 2026
EPF పెన్షన్ ₹1000 సరిపోదు: పార్లమెంటరీ ప్యానెల్

ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కింద నెల వారీ పెన్షన్ కేవలం ₹1000 ఇస్తుండడాన్ని తక్షణమే సమీక్షించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి సూచించింది. గౌరవప్రదమైన స్థాయిలో ప్రజల పెన్షన్లు ఉండాలని పేర్కొంది. కనీస పెన్షన్ ₹7,500 చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. జీవనవ్యయం పెరిగినా అమౌంట్ మారలేదని.. బడ్జెట్‌లో కేటాయింపులు పెంచే విషయాన్ని పరిశీలించాలని కమిటీ పేర్కొంది.


