News November 10, 2024

13న ట్రంప్, బైడెన్ భేటీ!

image

US అధ్యక్షుడు జో బైడెన్, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 13న శ్వేతసౌధంలో భేటీ అవుతారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. పదవి నుంచి తప్పుకొనే అధ్యక్షుడు, కొత్తగా పదవిలోకి వచ్చే అధ్యక్షుడితో సమావేశమై కీలక వివరాలను పంచుకోవాల్సి ఉంటుంది. ట్రంప్‌నకు అధికార బదలాయింపు ప్రక్రియ జనవరిలో పూర్తి కానుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా తాను చూసుకుంటానని బైడెన్ ఇప్పటికే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Similar News

News January 12, 2026

మరోసారి పాక్ డ్రోన్ల కలకలం

image

సరిహద్దుల్లో మరోసారి పాకిస్థాన్ డ్రోన్లు కలకలం రేపాయి. జమ్మూకశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్‌లో LoC వెంబడి ఇవాళ సాయంత్రం ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది. దీంతో ఆర్మీ ఫైరింగ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. తర్వాత మరికొన్ని కనిపించినట్లు ఆర్మీ వర్గాలు చెప్పాయి. ఆయుధాలు/డ్రగ్స్ జారవిడిచారనే అనుమానంతో సెర్చ్ చేస్తున్నట్లు చెప్పాయి. సాంబా సెక్టార్‌లో నిన్న డ్రోన్ ద్వారా పాక్ వెపన్స్ <<18815524>>డ్రాప్ చేయడం<<>> తెలిసిందే.

News January 12, 2026

‘మన శంకరవరప్రసాద్ గారు’ పబ్లిక్ టాక్

image

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ ప్రీమియర్స్ ప్రారంభమయ్యాయి. చిరు ఎంట్రీ అదిరిపోయిందని, ఫస్ట్ ఫైట్ వింటేజ్ మెగాస్టార్‌ను గుర్తు చేస్తుందని ఆడియన్స్ చెబుతున్నారు. కామెడీ బాగుందని, అనిల్ రావిపూడి రెగ్యులర్ స్టైల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆకట్టుకుందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కొన్ని చోట్ల రొటీన్, సాగదీత సీన్లు ఉన్నాయంటున్నారు. రేపు ఉదయం Way2Newsలో ఫుల్ రివ్యూ&రేటింగ్.

News January 11, 2026

సంక్రాంతి.. YCP vs TDP

image

సంక్రాంతి వేళ ఏపీకి వస్తున్న ప్రజలు సొంతూరి దుస్థితి చూసి నిట్టూరుస్తున్నారని YCP ట్వీట్ చేసింది. గుంతల రోడ్లు, మద్దతు ధర లేక రైతులు పంటను రోడ్లపై పారేస్తున్నారని ఓ ఫొటోను షేర్ చేసింది. ఏడాదిన్నరలోనే ఇలా భ్రష్టు పట్టించేశారేంటని మాట్లాడుకుంటున్నారని పేర్కొంది. దీనికి టీడీపీ కౌంటర్ ట్వీట్ చేసింది. పోలవరం, అమరావతి వేగంగా పూర్తవుతున్నాయని, ఏపీ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని మరో ఫొటో షేర్ చేసింది.