News November 10, 2024

టీచర్లను సన్మానించనున్న ప్రభుత్వం

image

AP: నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను సన్మానించనుంది. వరదల కారణంగా వాయిదాపడ్డ టీచర్స్ డే వేడుకలను కూడా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనుంది. ఈ సందర్భంగా 174 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానించనుంది. వారికి బెస్ట్ టీచర్ అవార్డులు ఇవ్వనుంది.

Similar News

News January 19, 2026

IREDAలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

image

ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్(<>IREDA<<>>)లో 10 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. BCom, BCA, డిప్లొమా(CS/IT) అర్హతగల వారు NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ireda.in

News January 19, 2026

అమెనోరియా సమస్యకు కారణమిదే!

image

వివిధ కారణాలతో కొందరు మహిళలకు నెలసరి సమయానికి రాదు. దీన్ని అమెనోరియా అంటారు. నెలసరి లేటుగా మొదలవడాన్ని ప్రైమరీ అమెనోరియా అని, రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోవడాన్ని సెకండరీ అమెనోరియా అని అంటారు. వంశపారంపర్యం, జన్యు కారణాలు, PCOS, ఈటింగ్ డిజార్డర్ వల్ల ఈ సమస్య వస్తుంది. ప్రారంభదశలోనే చికిత్స చేయించుకోకపోతే గర్భసంచి, గుండె సమస్యలు, బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదముంది.

News January 19, 2026

20 ఏళ్లుగా చెబుతున్నా వినలేదు.. ఇక టైమ్ వచ్చింది: ట్రంప్

image

గ్రీన్‌లాండ్‌ విషయంలో డెన్మార్క్ తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ‘రష్యా నుంచి గ్రీన్‌లాండ్‌కు ముప్పు ఉందని 20 ఏళ్లుగా డెన్మార్క్‌కు నాటో చెబుతోంది. కానీ ఈ విషయంలో డెన్మార్క్ ఏమీ చేయలేదు. ఇప్పుడు సమయం వచ్చింది. అది జరిగి తీరుతుంది’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. గ్రీన్‌లాండ్‌ తమకు చాలా ముఖ్యమని, <<18784880>>అవసరమైతే సైన్యాన్ని<<>> వాడతామని వైట్ హౌస్ హెచ్చరించడం తెలిసిందే.