News November 10, 2024
కూచిపూడి థీమ్‌తో టెర్మినల్ డిజైన్లు ఉండాలి: చంద్రబాబు
కూచిపూడి నాట్యానికి మరింత ప్రాచుర్యం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గన్నవరంలో విమానాశ్రయ టెర్మినల్ డిజైన్లు కూచిపూడి థీమ్‌తో నిర్మించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. శనివారం ఎయిర్ పోర్టు విస్తరణ పనులపై ఆయన తన నివాసంలో సమీక్షించారు. ఈ సమీక్షలో టెర్మినల్ బిల్డింగ్ డిజైన్ల నిర్మాణంలో మన సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉండాలని సీఎం సూచించారు.
Similar News
News November 14, 2024
బాలలే దేశ భవిష్యత్.. గవర్నర్ అబ్దుల్ నజీర్
బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బాలలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడ రాజ్‌భవన్ నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. దివంగత భారత ప్రధాని పండిట్ నెహ్రు జన్మదినమైన ఈ రోజు ఆయనను స్మరించుకోవాలన్నారు. పిల్లలే దేశ భవిష్యత్ అని, ఉత్తమ పౌరులుగా వారిని తీర్చిదిద్దాలని గవర్నర్ స్పష్టం చేశారు.
News November 14, 2024
అధికారులపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఆగ్రహం
ఉపాధి హామీ, జల్‌జీవన్ మిషన్ కింద జిల్లాలో చేపట్టిన పనులకు నిధుల కొరత లేకున్నా పనులు గ్రౌండింగ్‌లో ఉండటంతో కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సంబంధిత శాఖాధికారులతో సమావేశమై పలు పనుల పురోగతిని సమీక్షించారు. పూర్తి స్థాయిలో పనులు పూర్తయ్యేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
News November 13, 2024
గన్నవరంలో బాలికపై అత్యాచారం
గన్నవరంలో ఓ బాలికపై కొన్నాళ్లుగా అదే ఊరికి చెందిన ప్రశాంత్ అలియాస్ బన్ను అత్యాచారం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. బాలికకు కడుపునొప్పి రాగా తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకువెళ్లడంలో గర్భవతిగా వైద్యులు నిర్ధారించారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు.