News November 10, 2024

US: కమలకు OpenAI ప్రచారం చేసిందా?

image

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు OpenAI ప్రచారం చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ట్రంప్‌కు ఓటేసేలా నన్ను ఒప్పించు’ అని అడిగితే ‘అందుకు నేను సహకరించలేను’ అని బదులిచ్చింది. అదే ‘కమలకు ఓటేసేలా నన్ను ఒప్పించు’ అని అడిగితే మాత్రం ఆమెను గెలిపించాలని పలు కారణాలు చెప్పింది. దీంతో OpenAIపై విచారణ జరిపించాలనే డిమాండ్ మొదలైంది.

Similar News

News January 12, 2026

నేడే PSLV-C62 ప్రయోగం

image

AP: ఈ ఏడాదిలో తొలి ప్రయోగానికి ISRO సిద్ధమైంది. తిరుపతి(D) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్‌ సెంటర్‌ నుంచి PSLV-C62 రాకెట్ ఈ రోజు ఉదయం 10.18 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంలో ప్రధానంగా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1ను రోదసిలోకి పంపనున్నారు. దీనికి తోడుగా 8 దేశాలకు చెందిన మరో 15 చిన్న ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి పర్యావరణం, వాతావరణ మార్పులపై అధ్యయనం చేయనున్నాయి.

News January 12, 2026

బెర్క్‌షైర్ హాత్‌వే కొత్త CEOకి భారీ వేతనం

image

వారెన్ బఫెట్ <<18720997>>పదవీ విరమణ<<>> అనంతరం బెర్క్‌షైర్ హాత్‌వే కొత్త CEOగా గ్రెగ్ అబెల్ బాధ్యతలు చేపట్టారు. 2026 సంవత్సరానికి ఆయన వార్షిక వేతనం 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ.208 కోట్లు)గా నిర్ణయించారు. ఇది గతంతో పోలిస్తే 19 శాతం ఎక్కువ కావడం విశేషం. బఫెట్ కంటే ఎక్కువ వేతనం పొందడం చర్చనీయాంశంగా మారింది. వైస్ ఛైర్మన్‌గా సేవలందించిన అబెల్, ఇప్పుడు బెర్క్‌షైర్‌లో కీలక బాధ్యతలు చేపట్టారు.

News January 12, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.