News November 10, 2024
రాష్ట్రంలో 243 కులాలు: ప్రభుత్వం

TG: రాష్ట్రంలో మొత్తం 243 రకాల కులాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బీసీల్లో 134, ఎస్సీల్లో 59, ఎస్టీల్లో 32, ఓసీల్లో 18 సామాజిక వర్గాలున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టిన నేపథ్యంలో కులాలకు కోడ్‌లను కేటాయించింది. కులం, మతం లేదన్న వారికీ ఓ కోడ్‌ను కేటాయించింది. ఇతర రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా కోడ్‌లతో డేటా సేకరిస్తోంది. భూసమస్యలపైనా ప్రజల నుంచి వివరాలు సేకరిస్తోంది.
Similar News
News January 29, 2026
BRS యాక్షన్‌ను బట్టి నా రియాక్షన్ ఉంటుంది: దానం

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణల వేళ స్పీకర్ నోటీసులిచ్చిన నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ‘విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని చెప్పలేదు. స్పీకర్ నోటీసులకు మా అడ్వకేట్ వివరణ లేఖ రాశారు. అందులో ఏం రాశారో నాకు తెలియదు. స్పీకర్ నుంచి మళ్లీ జవాబు రాలేదు. BRS నన్ను సస్పెండ్ చేయలేదు. ఆ పార్టీ యాక్షన్‌ను బట్టి నా రియాక్షన్ ఉంటుంది. ఎన్నికలకు నేను భయపడను’ అని ఆయన స్పష్టం చేశారు.
News January 29, 2026
యాదాద్రిలో బంగారు, వెండి డాలర్లు మాయం

TG: యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్ల మాయం అంశం కలకలం రేపుతోంది. ప్రచార శాఖలో రూ.10 లక్షల మేర విలువైన కాయిన్స్ మాయమైనట్లు ఆడిట్‌లో వెల్లడైంది. ఇటీవలే ప్రసాదాల తయారీలో చింతపండు చోరీ కలకలం రేపడం తెలిసిందే.
News January 29, 2026
జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ తెరకెక్కించిన ‘విశ్వంభర’ సినిమా విడుదలపై ఓ క్లారిటీ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ లేదా జులై నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు రీసెంట్ మీడియా ఇంటరాక్షన్‌లో చిరంజీవి చెప్పినట్లు సినీవర్గాలు తెలిపాయి. అందులోనూ జులై 10న రావొచ్చని డేట్ కూడా చెప్పేశారట. భారీ ఫాంటసీ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రానికి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.


