News November 10, 2024
ప్రకాశం: ‘ఆ SI శ్రమకి ఫలితం దక్కలేదు’
ప్రకాశం జిల్లా ఉలవపాడు SI అంకమ్మ శనివారం ప్రాణాలకు తెగించి ఓ సాహసం చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఉలవపాడులోని వేణుగోపాలస్వామి ఆలయ కోనేరులో మతిస్థిమితంలేని యువకుడు శనివారం కాలుజారి పడ్డాడు. విషయం తెలుసుకున్న SI అక్కడికి చేరుకున్నారు. తర్వాత తానే స్వయంగా కోనేరులో దూకి యువకున్ని కాపాడే ప్రయత్నం చేయగా దురదృష్టవశాత్తు అతడు అప్పటికే మృతి చెందాడు.
Similar News
News November 14, 2024
ఒంగోలులో DLDO సస్పెండ్
ప్రకాశం జిల్లాలో ఓ కీలక అధికారిణి సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం ఒంగోలు డీఎల్డీవోగా ఉన్న ఉషారాణి గతంలో డీపీవోగా పనిచేశారు. ఇటీవల గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఇందులో ఆమె అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతో కలెక్టర్ తమీమ్ అన్సారియా విచారణకు ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా ఆమెను ప్రభుత్వానికి సరెండ్ చేయగా.. తాజాగా ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.
News November 13, 2024
అల్పపీడనం.. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో బాపట్ల, ప్రకాశం జిల్లాల వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉందని ఇప్పటికే ప్రజల ఫోన్లకు మెసేజ్లు పంపిస్తోంది. ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో చెట్లు, సెల్ టవర్స్, విద్యుత్ స్తంభాల సమీపంలో, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది.
News November 13, 2024
ప్రకాశం: ‘పోలీసు శాఖ ప్రతిష్ఠ పెంచేలా ఉండాలి’
పోలీస్ ప్రతిష్ఠ మరింత పెంచేందుకు సాయుధ బలగాల పనితీరు బాగుండాలని ఎస్పీ దామోదర్ చెప్పారు. ఏఆర్ సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో మంగళవారం దర్బార్ కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాజువల్ లీవు, ట్రాన్స్ఫర్స్, టిఏలు, అలవెన్సులు, ఏఆర్, స్పెషల్ పార్టీ పోలీసుల బందోబస్తులు, జీపీఎఫ్ లోన్, మెడికల్ బిల్లులు, సీనియారిటీ లిస్టు తదితర సమస్యల గురించి చర్చించారు.