News November 10, 2024
పిట్లం: భానుడు.. చెరువులో విద్యుత్ వెలుగులా..!

సాయంత్రం వేళ సూర్యాస్తమయ సమయాన సూర్యుడి ప్రతిబింబం చెరువు నీటిలో విద్యుత్ బల్బు మాదిరి సాక్షాత్కరించింది. ఆకాశమంతా ఎర్రని కాంతులను వెదజల్లుతూ.. మరో వైపు నీటిలో దీప కాంతిని ప్రసరిస్తూ కనువిందు చేసింది. ఈ దృశ్యాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. పిట్లంలోని గ్రామ చెరువు వద్ద శనివారం ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించారు.
Similar News
News January 11, 2026
ఆర్మూర్: దంపతుల ఆత్మహత్యాయత్నం

ఆర్మూర్ శివారులో శనివారం సాయంత్రం దంపతులు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ మండలం పడిగేలా గ్రామం వడ్డెర కాలనికి చెందిన రవితేజ, భార్య శోభ పట్టణ శివారులోని ఓ వెంచర్‌లో విషం తాగి ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.
News January 11, 2026
NZBకు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాక

TPCC చీఫ్, MLC మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం నిజామాబాద్ వస్తున్నారు. ఉదయం 8 గంటలకు HYD నార్సింగి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.30కు NZB చేరుకుంటారు. 12 గంటలకు స్థానికంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 3 గంటలకు R&B గెస్ట్ హౌస్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి నిజామాబాద్‌లో బస చేసి సోమవారం ఉదయం 11 గంటలకు వరంగల్ బయలుదేరి వెళ్తారు.
News January 11, 2026
NZB: చైనా మాంజా విక్రయాలపై పోలీసుల తనిఖీలు

చైనా మాంజా విక్రయాలపై పోలీసులు కొరడా ఝులిపించారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు NZB, బోధన్, ఆర్మూర్ డివిజన్ పరిధిలోని స్టేషన్‌ల పరిధిలో భారీగా తనిఖీలు చేశారు. నిషేధిత చైనా మాంజా ఎవరైనా విక్రయించినా, నిల్వ, రవాణా చేసినా నేరమేనని సీపీ తెలిపారు. చైనా మాంజా విక్రయం వల్ల, జంతువులకు, పక్షులకు, మనుషులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే 100కు సమాచారం ఇవ్వాలన్నారు.


