News November 10, 2024
ఉమ్మడి ప.గో జిల్లాలో బెస్ట్ టీచర్ అవార్డులు వీరికే..!
➤ S.పెద్దిరాజు(HM, ఉంగుటూరు MPP స్కూల్)
➤ కూనాటి జాన్ (కైకారం జడ్పీ స్కూల్)
➤ బీఎస్ఎన్.కళ్యాణి(దెందులూరు జడ్పీ స్కూల్)
➤గుగ్గులోత్తు కృష్ణా(ఏలూరు ఇందిరా కాలనీ)
➤ బీఎల్ నరసింహ మూర్తి(వాడలి జడ్పీ హైస్కూల్)
➤ VVSS.నాగలక్ష్మి(నరసాపురం 10వ వార్డు స్కూల్)
➤ పి.పోలారావు(ఎర్రాయి చెరువు స్కూల్)
Similar News
News November 14, 2024
పెనుగొండ : కొండెక్కుతున్న ఉల్లి
ఉల్లిధర వినియోగదారులను కంటతడి పెట్టిస్తోంది. నెల నుంచి వారవారానికి ధర ఎగబడుతోంది. పెనుగొండ మార్కెట్లో ఉల్లి ధరలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పైగా కార్తీక మాసం కావడంతో ఈ వారం రోజుల్లోనే రూ. 70-80 కి చేరిందని వ్యాపారస్థులు చెబుతున్నారు. ఉల్లి దిగుమతి తగ్గడంతో ధరలు ఊపందుకున్నాయని అంటున్నారు.
News November 14, 2024
పెనుగొండ: ఏఆర్ కానిస్టేబుల్‌తో పాటు కుటుంబానికి జైలు శిక్ష
పెనుగొండకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ మహేంద్రకుమార్, అతని కుటుంబానికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. మహేంద్రకుమార్ భార్య చైతన్యను అదనపు కట్నం కోసం హింసిస్తూ ఉంటే అతని తల్లి, తండ్రి సహకరించేవారు. దీంతో 2020లో బాధితురాలు ఆచంట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్టు బుధవారం నిందితులకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షలు జరిమానా విధించి, ఆసొమ్మును చైతన్యకు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.
News November 14, 2024
ప్రతి బుధ, శనివారాల్లో సదరమ్ సర్టిఫికెట్లు జారీ: కలెక్టర్
ఏలూరు జిల్లాలో విభిన్న ప్రతిభావంతులను ఆదుకునేందుకు అధిక ప్రాధాన్యతనిస్తామని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ జిల్లాస్ధాయి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ప్రతి కార్యాలయంలో ఫిర్యాదుల పరిష్కార అధికారుల నియామకం జరుగుతుందన్నారు. అలాగే స్లాట్స్ ప్రకారం ప్రతి బుధ, శనివారాల్లో సదరమ్ సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు.