News November 10, 2024

సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు రెండోసారి వరించిన పదవి

image

కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్మన్‌గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు నియామకమయ్యారు. 1982 నుంచి టీడీపీలో చేరిన ఆయన పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ వచ్చారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక 2016లో కుడా తొలి ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. ఆపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన సేవలను గుర్తించి రెండోసారి కుడా ఛైర్మన్‌గా నియమించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 5, 2026

కర్నూలులో రికార్డు ధర

image

కర్నూలు జిల్లా మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం బ్యాడిగ మిర్చి క్వింటా రూ.38,508 గరిష్ఠ ధర పలికింది. ఈ సీజన్‌లో ఇదే రికార్డు ధర కావడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. సూపర్-10 రకం రూ.21,600, మిర్చి-5 రకం రూ.21,229, దేవనూరు డీలక్స్ రకం రూ.20,199, తేజ రకం రూ.19,600కు కొనుగోలు చేసినట్లు వ్యాపారులు తెలిపారు.

News March 5, 2026

నంద్యాల: WOW.. 106 ఏళ్ల వయసులోనూ..!

image

నేటి కల్తీ ఆహారపు విషవలయంలో మానవుడి సగటు ఆయువు 70 ఏళ్లకే పరిమితమవుతుంటే, నంద్యాల(D) పాములపాడు మండలం చెలిమిళ్లకు చెందిన లక్ష్మమ్మ 106 ఏళ్లు పూర్తి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ వయసులోనూ ఆమె చూపు మందగించకపోవడం, తన పనులు తానే చేసుకోవడం విశేషం. ఆ రోజుల్లో తీసుకున్న రాగి సంగటి, జొన్నరొట్టెలు, కొర్రలు, సజ్జలు వంటి ప్రకృతి సిద్ధమైన ఆహారం ఆమెను నేటికీ ఆరోగ్యంగా ఉంచాయని మేనల్లుడు ఏసన్న తెలిపారు.

News March 5, 2026

కర్నూలు: 395 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

image

పత్తికొండ శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్, ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలలో 395 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని తెలిపారు.