News November 10, 2024
18 లోగా పరీక్ష ఫీజులు చెల్లించాలి: డీఈఓ భిక్షపతి
2025 సంవత్సరం మార్చి నెలలో జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షల ఫీజును ఈనెల 18లోగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 50 అపరాధ రుసుముతో డిసెంబర్ 2, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 12, రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబర్ 21 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
Similar News
News November 14, 2024
నల్గొండ: వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురు మృతి
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. వివరాలిలా.. రామన్నగూడెం వాసి రాములు(59) తుంగతుర్తి శివారులో బైక్ ఢీకొట్టడంతో మృతిచెందారు. అటు రంగారెడ్డి జిల్లాకి చెందిన అభిలాశ్(24) చౌటుప్పల్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చనిపోయాడు. తిప్పర్తి (M) మల్లేవారిగూడానికి చెందిన కొండయ్య పొలం పనికి వెళ్తున్న క్రమంలో మిర్యాలగూడ వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో స్పాట్‌లో మృతిచెందాడు.
News November 14, 2024
నల్గొండలో గ్రూప్ -III పరీక్షకు 88 కేంద్రాలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ -III పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. నల్గొండ జిల్లాలో 28,353 మంది పరీక్ష రాస్తున్నరని వారి కోసం 88 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నేడు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
News November 13, 2024
BREAKING: నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్
రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని పలువురికి గాయాలైన ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.