News November 10, 2024

కేటీఆర్‌ను ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు: షబ్బీర్ అలీ

image

కేటీఆర్ ఓ బచ్చా అని, ఆయన్ను ఫార్ములా రేస్ కేసులో ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఆయన నిజామాబాద్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తుంటే ప్రజల నుంచి ఆదరణ వస్తోందని, దాన్ని చూసి ఓర్వలేకనే కేటీఆర్ అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ప్రతిపక్షనేతగా కేసీఆర్‌ను మాత్రమే గుర్తిస్తుందన్నారు.

Similar News

News January 14, 2025

భీమ్‌గల్: సెల్ఫీ వీడియోపై స్పందించిన ఎస్ఐ

image

భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన తక్కూరి నికేష్ సెల్ఫీ వీడియోపై ఎస్ఐ మహేశ్ స్పందించారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా పలుమార్లు స్టేషన్‌కు పిలిచినా రాలేదన్నారు. తప్పించుకు తిరుగుతూ పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఎవరి ప్రోద్బలంతో హింసించ లేదని, అతని ఆరోపణలు అవాస్తవమన్నారు. ఈ మేరకు ఎస్ఐ మహేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.

News January 14, 2025

NZB: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో

image

సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 7331149141 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు ఖచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.

News January 13, 2025

NZB: జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి

image

జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా నిజామాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు భారత ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. పల్లె గంగారెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు.