News November 10, 2024

గ్రూప్-2 మెయిన్స్ వాయిదా.. FEB 23న పరీక్ష?

image

AP: రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ షెడ్యూల్ ప్రకారం జనవరి 5న <<14491669>>జరగాల్సి<<>> ఉండగా అభ్యర్థుల వినతి మేరకు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 23న ఈ పరీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడటంతోపాటు మెయిన్స్‌కు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించాక అధికారులు కొత్త తేదీపై అధికారిక ప్రకటన చేయనున్నారు.

Similar News

News December 27, 2024

దేశం గొప్ప నేతను కోల్పోయింది: ప్రధాని మోదీ

image

మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అత్యంత గొప్ప నాయకుల్లో ఒకరైన నేతను దేశం కోల్పోయిందన్నారు. నిరాడంబరమైన మూలాల నుంచి ఎదిగి గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారని కొనియాడారు. మన ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆయన విస్తృతంగా కృషి చేశారని ప్రశంసించారు.

News December 27, 2024

మాటలు తక్కువ.. పని ఎక్కువ

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు చెప్పగానే ‘ఆయన అసలేం మాట్లాడరు’ అని అంతా అంటుంటారు. అవును నిజమే. చాలామంది రాజకీయ నేతల్లా ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు. చేతల్లో పని చూపించే నేత. 1991 నుంచి 1996 వరకు దేశ ఫైనాన్స్ మినిస్టర్‌గా పనిచేసిన మన్మోహన్.. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆయన హయాంలోనే అత్యధిక జీడీపీ 10.2శాతం వృద్ధిరేటు నమోదైంది. వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్ల కేటాయింపు జరిగింది.

News December 27, 2024

ప్రజలకు ‘ఉపాధి’ కల్పించింది ఆయనే..

image

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు పని క‌ల్పిస్తున్న ఉపాధి హామీ ప‌థ‌కాన్ని మ‌న్మోహ‌న్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు. 1991లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలను ప్రధానిగా ఆయన కొనసాగించారు. తద్వారా విదేశీ పెట్టుబడులు, ప్రైవేటీకరణ, లైసెన్సింగ్ విధానాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అమెరికాతో అణు ఒప్పందం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, స‌మాచార హ‌క్కు చ‌ట్టం వంటి కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు పునాది వేశారు.