News November 10, 2024
సర్వేలో పాల్గొనండి.. పథకాల్లో కోత ఉండదు: మంత్రి పొన్నం

TG: రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హుస్నాబాద్‌లో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ సమాచారం అంతా గోప్యంగా ఉంటుందని, సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్యుమరేటర్లకు ఇబ్బంది కలిగించడం సరికాదన్నారు. ఈ సర్వే తర్వాత సంక్షేమ పథకాల్లో కోత ఉండదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు.
Similar News
News September 13, 2025
తిరుమల: భక్తులతో నిండిపోయిన కంపార్టుమెంట్లు

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి కృష్ణ తేజ గెస్ట్ హౌస్ నుంచి క్యూలైన్ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి వేంకటేశ్వరుడి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.18కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది. 69,842 మంది స్వామివారిని దర్శించుకోగా.. 28,234 మంది తలనీలాలు సమర్పించారు.
News September 13, 2025
మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ విడుదల

TG: 4,079 మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6.11 కోట్ల రివాల్వింగ్ ఫండ్ రిలీజ్ చేసింది. ఒక్కో సంఘానికి రూ.15,000 కేటాయించనుంది. ఈ నిధుల వినియోగాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా, మండల, గ్రామ సమాఖ్యలు పర్యవేక్షిస్తాయి. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 397 సంఘాలకు, అత్యల్పంగా మంచిర్యాల జిల్లాలో 3 సంఘాలకు నిధులు అందనున్నట్లు సమాచారం.
News September 13, 2025
ఆమిర్ ఖాన్ తనయుడి సినిమాలో సాయిపల్లవి

సౌత్ హీరోయిన్ సాయిపల్లవి బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో ఓ సినిమా చేస్తున్నారు. సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి తొలుత ‘ఏక్ దిన్’ అనే టైటిల్‌ను అనుకున్నారు. తాజాగా దానిని ‘మేరే రహో’గా మార్చారు. ఈ మూవీని నవంబర్ 7న రిలీజ్ చేయాల్సి ఉండగా డిసెంబర్ 12కు వాయిదా వేశారు. ఇది సాయిపల్లవికి హిందీలో డెబ్యూ మూవీ కానుంది. ఆమె రణ్‌బీర్ ‘రామాయణ’ మూవీలోనూ నటిస్తున్నారు.