News November 10, 2024

నందిపేట్‌లో వివాహితపై అత్యాచారం

image

వివాహితను అత్యాచారం చేసిన ఘటన నందిపేట‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆర్మూర్ CI వివరాలు.. ఈ నెల 6న ఉమ్మెడకు చెందిన అరుణ్, ముత్యం మద్యం తాగి భాగ్యమ్మ సాయంతో ఓ మహిళను అత్యాచారం చేశారు. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు భాగ్యమ్మను కొట్టడంతో మంత్రాల నెపంతో తనను కొట్టారంటూ ఆమె ACPకి ఫిర్యాదు చేసింది. శుక్రవారం విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలియడంతో అరుణ్, ముత్యం, భాగ్యమ్మను అరెస్ట్ చేశారు.

Similar News

News March 4, 2026

NZB: ఇక్రిశాట్‌ను సందర్శించిన రైతు కమిషన్ బృందం

image

పటాన్ చెరులోని ఇక్రిశాట్‌ను ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డితో కలిసి రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, సభ్యుడు గడుగు గంగాధర్ తదితర బృందం సందర్శించింది. ఫీల్డ్ విజిట్‌లో భాగంగా ఇక్రిశాట్‌లో సాగు చేస్తున్న ఆరుతడి పంటలను పరిశీలించారు. అక్కడి శాస్త్రవేత్తలతో సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని కోరారు.

News March 4, 2026

నిజామాబాద్: బాధ్యులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు

image

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ రమేశ్ కుమార్, హౌజ్ మాస్టర్ కుల్దీప్ యాదవ్, హాస్టల్ వార్డెన్ విశ్వంబర్, మెస్ ఇన్‌ఛార్జ్ ఆకాశ్ యాదవ్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఇందల్వాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. అధ్యాపకులు, విద్యార్థులతో భేటీ అయ్యారు. రామ్ చరణ్ ఆత్మహత్య ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News March 4, 2026

ఇందల్వాయి: విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్

image

ఇందల్వాయిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో రామ్ చరణ్ (15) అనే 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపించారు. ప్రాంతీయ సమన్వయకర్త గంగారాం నాయక్ నేతృత్వంలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఏకలవ్య మోడల్ స్కూళ్ల ప్రిన్సిపల్స్ శ్రీనివాస్ స్వామి, డా.సైదా జైనబ్, ఫణి కుమార్, డా.జ్యోతి విచారణ జరిపి నివేదిక అందజేశారు.