News November 10, 2024

గడ్డి మందు తాగి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

image

గడ్డి మందు తాగి ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం భద్రాచలం పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ చదువుతున్న విద్యార్థి ధనలక్ష్మి తన ఇంట్లో గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే భద్రాచలంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా విద్యార్థి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News July 4, 2025

వరద విపత్తుల నిర్వహణకు సిద్ధం: ఖమ్మం కలెక్టర్

image

వరద విపత్తుల నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, సంబంధిత అధికారులతో కలిసి శుక్రవారం జిల్లా విపత్తుల నిర్వహణపై సమావేశమయ్యారు. గత సంవత్సరం వచ్చిన భారీ వరదలు, విపత్తుల నిర్వహణ కోసం జిల్లాలో చేసిన ఏర్పాట్లు, ప్రణాళిక తదితర అంశాలను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

News May 8, 2025

ఖమ్మం: ఆసుపత్రి నర్స్.. అనుమానాస్పద మృతి

image

సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న భూక్య కళ్యాణి(22) అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. పెనుబల్లి మండలం బ్రహ్మలకుంటకు చెందిన కళ్యాణి సత్తుపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో నర్సుగా పనిచేస్తూ మసీదు రోడ్డులోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. రూమ్‌లో ఉరివేసుకుని మృతి చెందగా స్థానికులు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 7, 2025

KMM: సెలవుల్లో పిల్లలు జర జాగ్రత్త..!

image

బడులకు వేసవి సెలవులు, పిల్లలకు ఆటవిడుపు మొదలయ్యాయి. పిల్లలకు ఆటలు, తమ మిత్రులతో సరదా కోసం ఈతకు బయటకి వెళ్తుంటారు.. పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. గత వారం రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో పిల్లలు ఆటవిడుపు కోసం బయటకి వెళ్లి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, పిల్లలను బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.