News November 10, 2024

REWIND: సీపీ బ్రౌన్‌కు కడపతో ఉన్న అనుబంధం ఇదే.!

image

తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన భాషోద్యమ వీరుడు సీపీ బ్రౌన్. 10-11-1798లో కలకత్తాలో జన్మించారు. ఈస్ట్ ఇండియా తరఫున భారత్‌కు వచ్చి 1820లో కడపల డిప్యూటీ కలెక్టర్‌గా పని చేరారు. ఆ రోజుల్లో కడపలో ఇళ్లు కొనుక్కొని అక్కడే ఉన్నారు. తెలుగు నేర్చుకుని తెలుగు భాషా పరిశోధనకు కృషి చేశారు. అనేక తెలుగు గ్రంథాలను కూడా రాశారు. అలాంటి గొప్ప వ్యక్తికి మన కడప జిల్లాతో సంబంధాలు ఉండటం గర్వంగా ఉందని పలువురు అన్నారు.

Similar News

News November 14, 2024

ప్యానల్ స్పీకర్ల జాబితాలో కడప జిల్లా MLAలు

image

వివిధ పార్టీలకు చెందిన MLAలను అసెంబ్లీ ప్యానల్ స్పీకర్‌లుగా నియమించారు. ఈక్రమంలో కడప జిల్లా బద్వేల్ వైసీపీ MLA దాసరి సుధాకు ఆ జాబితాలో చోటు దక్కింది. రెగ్యులర్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు.. దాసరి సుధ స్పీకర్ కుర్చీలో కూర్చుని అసెంబ్లీని నడుపుతారు. వైసీపీలో గెలిచిన 11 ఎమ్మెల్యేల్లో ఈమె ఒకరు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డిని సైతం ప్యానల్ స్పీకర్‌గా ఎంపిక చేశారు.

News November 14, 2024

పులివెందులలో అవినీతి.. 11 మందిపై విచారణ

image

పులివెందులలో ఏడేళ్ల క్రితం జరిగిన అవినీతిపై తిరిగి విచారణ మొదలైంది. పులివెందుల ICDS ప్రాజెక్టు పరిధిలో రూ.8.71 లక్షల విలువైన బియ్యం, పప్పులు, ఆయిల్, ఇతర ఆహార పదార్థాలు దుర్వినియోగం చేశారని 2017లో గుర్తించారు. అప్పడు షోకాజ్ నోటీసులు మినహా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో సీడీపీవోగా పనిచేసి రిటైర్డ్ అయిన సావిత్రితో పాటు మరో 10 మంది సూపర్వైజర్లపై విచారణకు తాజాగా ప్రభుత్వం ఆదేశించింది.

News November 14, 2024

కడపకు రానున్న గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్

image

ప్రముఖ సినీ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈనెల 18న కడపకు రానున్నట్టు తెలుస్తోంది. కడపలో ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్దదర్గాలో నిర్వహించే ముషాయర కార్యక్రమానికి వస్తున్నట్లు సమాచారం. 16న పెద్ద దర్గా గంధ మహోత్సవం, 17న ఉరుసు, 18న ముషాయిర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది ముషాయిరా కార్యక్రమానికి ఒక అతిధి రావడం ఆనవాయితీ. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.