News November 10, 2024
స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్

TG: 317 G.O. వల్ల స్థానికత కోల్పోయిన తమను వెంటనే సొంత జిల్లాలకు కేటాయించాలని ఉపాధ్యాయులు, ఉద్యోగులు కోరుతున్నారు. మంత్రివర్గ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టును బహిర్గతం చేయాలన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తాము అధికారంలోకి రాగానే 317 G.O. వల్ల స్థానికత కోల్పోయిన వారిని 48 గంటల్లోనే సొంత జిల్లాలకు పంపిస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్ నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News January 27, 2026
సంగారెడ్డి: జగ్గారెడ్డి WARNING

సంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ను మరో చోటికి తరలిస్తే ఊరుకునేది లేదని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు. ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పేరుతో ఆఫీస్‌లను పటాన్‌చెరు పరిధి కర్ధనూర్‌కు తరలించే అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మంత్రులు దామోదర్, పొంగులేటితో మాట్లాడేవరకు ఎలాంటి తరలింపు ఆలోచన చేయొద్దని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు సూచించారు.
News January 27, 2026
ఇంటర్వ్యూతో ESIC ఫరీదాబాద్‌లో 50 పోస్టులు

<
News January 27, 2026
ఒకే రోజు రూ.63 కోట్ల కలెక్షన్లు

సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బార్డర్-2’ భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. నిన్న ఒక్క రోజే ఈ మూవీకి రూ.63 కోట్ల కలెక్షన్లు వచ్చాయని మేకర్స్ తెలిపారు. మొత్తంగా నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.193.48 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందని పేర్కొన్నారు. అనురాగ్ సింగ్ తెరకెక్కించిన ఈ మూవీలో వరుణ్ ధవన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రలు పోషించారు.


