News November 10, 2024

పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్.. రిజిస్ట్రేషన్‌కు నేడే లాస్ట్ డేట్

image

కేంద్రం అమలు చేస్తోన్న ‘పీఎం ఇంటర్న్‌షిప్’ స్కీమ్‌కు రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. <>https://pminternship.mca.gov.in<<>> సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 21-24 ఏళ్ల మధ్య ఉండాలి. SSC, ఇంటర్, ITI, డిగ్రీ చదివిన వారు అర్హులు. మహీంద్రా&మహీంద్రా, టాటా గ్రూప్ వంటి సంస్థల్లో బ్యాంకింగ్, ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రావెల్ వంటి రంగాల్లో ఇంటర్న్‌షిప్స్ కల్పిస్తారు. నెలకు రూ.5,000 స్టైఫండ్ ఇస్తారు.

Similar News

News November 5, 2025

సంతానలేమిని నివారించే ఖర్జూరం

image

ఖర్జూరాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయని.. మగవారిలో సంతానలేమి సమస్యను నివారించడంలో ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. వీటిలో ఉన్న పొటాషియం నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఖర్జూరాల్లో అధికంగా ఉండే పీచు జీర్ణ ప్రక్రియకు మంచిది. ఇందులోని కెరోటనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే ఐరన్, విటమిన్ C, D, విటమిన్ B కాంప్లెక్స్ గర్భిణులకు మంచివని చెబుతున్నారు.

News November 5, 2025

SSC-కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఫలితాలు రిలీజ్

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) 552 గ్రూప్-B కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు సంబంధించి ఫలితాలు విడుదల చేసింది. ఆగస్టు 12న పేపర్ 1 పరీక్షను నిర్వహించగా.. పేపర్ 2 పరీక్షకు 3,642మంది క్వాలిఫై అయ్యారు. కటాఫ్ మార్కులను వెబ్‌సైట్‌లో పెట్టింది. పేపర్ 2 పరీక్ష షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనుంది. వెబ్‌సైట్: https://ssc.nic.in/

News November 5, 2025

రేపే బిహార్ తొలిదశ పోలింగ్

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచారానికి నిన్నటితో తెరపడింది. 18 జిల్లాల పరిధిలోని 121 సెగ్మెంట్లలో రేపు పోలింగుకు ఈసీ ఏర్పాట్లన్నీ పూర్తిచేసింది. ఈ దశలో 8 మంది మంత్రులతోపాటు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు, JJL పార్టీ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా ఈ నెల 11న మరో 122 స్థానాల్లో పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది.