News November 10, 2024
‘క’ చిత్ర యూనిట్‌ను అభినందించిన మెగాస్టార్

‘క’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం, దర్శకులు సుజిత్-సందీప్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కిరణ్ ట్వీట్ చేశారు. ‘బాస్ నుంచి అభినందనలు. గంటకుపైగా గుర్తుండిపోయే సంభాషణకు అవకాశమిచ్చిన మీకు ధన్యవాదాలు. మిమ్మల్ని కలిసిన ప్రతిసారి ఓ ఆశీర్వాదంగా భావిస్తాను’ అని రాసుకొచ్చారు. ఇటీవల ‘లక్కీ భాస్కర్’ డైరెక్టర్ వెంకీని కూడా చిరు అభినందించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 1, 2025
ఇక్కడ ఒకరాత్రి బస ఖర్చు ₹88 లక్షలు

ప్రపంచంలో అత్యంత ఖరీదైన హోటళ్లు అనేకం. వాటిలో జెనీవా(స్విట్జర్లాండ్)లోని ప్రెసిడెంట్ విల్సన్ ప్రత్యేకతే వేరు. ఇక్కడి పెంట్‌హౌస్ సూట్‌కు ఒకరాత్రి బస ఖర్చు ₹88 లక్షలు. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, 12 పడగ్గదులు ఉండే ఇందులో PA, చెఫ్, బట్లర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారు. హైప్రొఫైల్ వ్యక్తులు ఇందులో దిగుతుంటారు. 8 అంతస్తుల ఈ హోటల్ నుంచి జెనీవా లేక్, ఆల్ప్స్ పర్వతాల మధ్య సన్‌సెట్ ఎంతో అనుభూతి ఇస్తుంది.
News November 1, 2025
రేపే ఫైనల్: అమ్మాయిలూ అదరగొట్టాలి

ఉమెన్స్ ODIWC ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ముంబై వేదికగా రేపు 3PMకు భారత్- సౌతాఫ్రికా మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీస్‌లో AUSను చిత్తు చేసిన జోష్‌లో ఉన్న IND.. ఫైనల్లోనూ గెలిచి తొలి WCను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. స్మృతి, జెమీమా, హర్మన్, రిచా, దీప్తి, చరణి, రాధ, రేణుక ఫామ్ కంటిన్యూ చేస్తే గెలుపు నల్లేరుపై నడకే. SA కెప్టెన్ లారా, నదినె, కాప్‌లతో INDకు ప్రమాదం పొంచి ఉంది.
* ALL THE BEST TEAM INDIA
News November 1, 2025
రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

AP: రాష్ట్రంలో రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరులో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. వానలు పడే సమయంలో చెట్ల కింద నిలబడరాదని సూచించింది. కృష్ణా నదికి వరద తాకిడి ఉండటంతో పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


