News November 10, 2024

అమరావతికి రూ.15,000కోట్ల రుణం.. నిధుల వినియోగంపై ఉత్తర్వులు

image

AP: అమరావతికి వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరల్డ్ బ్యాంకు, ఏడీబీ కలిపి రూ.15,000కోట్ల రుణం ఇస్తాయని పేర్కొంది. ఆర్థిక సాయం పొందేందుకు CRDAకు అధికారం కల్పించింది. బ్యాంకుల నుంచి దశలవారీగా నిధుల సమీకరణ కోసం ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయనుంది. ఈ నిధులతో రాజధాని అభివృద్ధి ప్రణాళికను అమలు చేయాలని CRDAను ఆదేశించింది.

Similar News

News January 21, 2026

నేడు లలితా వ్రతం ఆచరిస్తే సకల సంపదలు

image

నేడు మాఘ శుద్ధ తదియ. ఈరోజు ‘లలితా వ్రతం’ ఆచరించడం అత్యంత శుభప్రదమని నమ్ముతారు. లలితా దేవిని షోడశోపచారాలతో పూజించి, ఎర్రటి పుష్పాలు, కుంకుమతో అర్చన చేస్తారు. వివాహిత స్త్రీలు సౌభాగ్యం కోసం, కన్యలు ఉత్తమమైన వరుడు లభించాలని ఈ వ్రతాన్ని ఎంతో నిష్ఠతో చేస్తారు. శక్తి స్వరూపిణి అయిన లలితా పరాభట్టారికను ధ్యానిస్తూ లలితా సహస్రనామ పారాయణ చేస్తే పాపాలన్నీ తొలగి, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

News January 21, 2026

టోల్‌ ఫీ పెండింగ్ ఉంటే వాహన సేవలకు బ్రేక్

image

హైవేలపై టోల్ చెల్లింపుల విషయంలో కేంద్రం కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. టోల్ ఫీ పెండింగ్ ఉన్న వాహనాలకు ఇకపై వెహికల్ ఓనర్‌షిప్‌కు అవసరమైన NOC, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యూవల్, నేషనల్ పర్మిట్ లభించదని స్పష్టం చేసింది. చాలా సందర్భాల్లో వాహనదారులకు తెలియకుండానే బకాయిలు ఏర్పడే అవకాశముంది. టోల్‌ప్లాజా వద్ద టెక్నికల్ సమస్యల వల్ల మనీ కట్ అవ్వకపోవడం కూడా టోల్ ఫీ పెండింగ్‌గా చూపించే అవకాశముంది.

News January 21, 2026

రాష్ట్రంలో ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్!

image

ఇజ్రాయెల్ ఆర్థిక, పరిశ్రమల మంత్రి నిర్ బర్కత్, ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్‌తో దావోస్‌లో CM చంద్రబాబు భేటీ అయ్యారు. ‘రక్షణ, ఏరోస్పేస్, UAV పర్యావరణ వ్యవస్థలు, డీశాలినేషన్, సెమీకండక్టర్, క్వాంటం లీడర్‌షిప్, వైద్యం, విద్య, సైబర్ సెక్యూరిటీలో అవకాశాలపై చర్చించాం. మెడ్-టెక్, ఏరో-డిఫెన్స్, క్లీన్-టెక్ కంపెనీలకు ఆతిథ్యమివ్వడానికి రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని ప్రతిపాదించాను’ అని ట్వీట్ చేశారు.