News November 10, 2024

అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ.. గతంలో ఏం జరిగింది?

image

అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని YS జగన్ నిర్ణయించడంతో గతంలో NTR, YSR, CBN కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని రాజకీయ వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. NTR 1993లో, 1995లో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. 1999-2004 మధ్య YSR కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చివరి రెండేళ్లు సమావేశాలకు వెళ్లలేదు. 2014 తర్వాత జగన్, 2021లో చంద్రబాబు CM అయ్యాకే సభకు వస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Similar News

News November 14, 2024

ఐదుసార్లు ఎమ్మెల్యే.. అత్యంత నిరాడంబర జీవితం!

image

TG: గల్లీ లీడర్లే దేశ ప్రధాని స్థాయిలో వీఐపీ ట్రీట్‌మెంట్ కావాలని ఫీలయ్యే రోజులివి. అలాంటిది ఇల్లెందు మాజీ MLA గుమ్మడి నర్సయ్య 5సార్లు ఎమ్మెల్యేగా పని చేసినా నిరాడంబరంగా జీవిస్తున్నారు. సైకిల్, RTC బస్సులే ఆయనకు ప్రయాణ సాధనాలు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంటి పరీక్షల కోసం వెళ్లారు. అందరితో పాటు వేచి చూసి తన వంతు వచ్చాక వెళ్లి పరీక్ష చేయించుకున్నారు. దీంతో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.

News November 14, 2024

ఏపీ, తెలంగాణలో 3రోజులు వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ్టి నుంచి 16వరకు కుండపోత వర్షాలు పడతాయని అంచనా వేసింది. HYD వాతావరణంలో మార్పులు ఉంటాయని పేర్కొంది.

News November 14, 2024

ఉక్రెయిన్‌కు మద్దతివ్వడం US భద్రతకు కీలకం.. ట్రంప్‌తో బైడెన్

image

ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి బైడెన్‌తో ట్రంప్ <<14604330>>భేటీ<<>> అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్‌ పరిస్థితులపై ఆసక్తికర చర్చ జరిగింది. ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేయడం నేషనల్ సెక్యూరిటీకి ముఖ్యమని బైడెన్ చెప్పారు. యూరప్ బలంగా, స్థిరంగా ఉంటేనే యుద్ధం నుంచి US దూరంగా ఉండటం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు, యూరప్ అంశాల్లో ట్రంప్ వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే.