News November 10, 2024

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం కరెక్టేనా?

image

AP: ప్రతిపక్ష హోదా లేదనే కారణంతో అసెంబ్లీ సమావేశాలను YCP బహిష్కరించడం కరెక్ట్ కాదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓటు వేసి గెలిపించిన ప్రజల కోసమైనా సభకు వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పలువురు అంటున్నారు. మెజారిటీ సీట్లు ఇచ్చినప్పుడు అధికార పక్షంగా అసెంబ్లీకి వెళ్లిన వారు, ఇప్పుడు తక్కువ సీట్లు వచ్చినప్పుడు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్నారు. సభలో విపక్షం ఉండాల్సిందేనని చెబుతున్నారు.

Similar News

News November 14, 2024

వరుణ్ తేజ్ ‘మట్కా’ పబ్లిక్ టాక్

image

కరుణ కుమార్ డైరెక్షన్‌లో వరుణ్ తేజ్-మీనాక్షి చౌదరి నటించిన ‘మట్కా’ మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కినప్పటికీ కథలో కొత్తదనం లేదని, చాలా స్లోగా ఉందని, పాటలు ఆకట్టుకోలేదని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మెగా ప్రిన్స్ లుక్‌లో వేరియేషన్స్, యాక్టింగ్ బాగుందని మరికొందరు చెబుతున్నారు.
కాసేపట్లో WAY2NEWS రివ్యూ

News November 14, 2024

గ్రూప్-3 నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: CS

image

TG: నవంబర్ 17, 18 తేదీల్లో జరిగే గ్రూప్-3 పరీక్షకు 1401 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో పరీక్ష సజావుగా, సక్రమంగా నిర్వహించేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఇక పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నారు.

News November 14, 2024

బాలల దినోత్సవం: నవంబరు 14నే ఎందుకంటే..

image

దేశ తొలి PM నెహ్రూ పిల్లలతో సమయం గడపడాన్ని ఇష్టపడేవారు. స్వాతంత్ర్యోద్యమం కారణంగా తన సొంత బిడ్డ అయిన ఇందిరకూ దూరంగానే గడపాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో PM అయిన తర్వాత క్రమం తప్పకుండా పిల్లల్ని కలుస్తూ వారి సమక్షంలో సంతోషాన్ని పొందేవారు. 1964లో ఆయన కన్నుమూసిన తర్వాతి నుంచి జవహర్‌లాల్‌ జయంతిని భారత ప్రభుత్వం బాలల దినోత్సవంగా జరుపుతోంది. అప్పటి వరకు అంతర్జాతీయ తేదీ అయిన నవంబరు 20న వేడుకలు జరిగేవి.