News November 10, 2024

కెనడాలో నిజ్జర్ సహాయకుడి అరెస్ట్?

image

హత్యకు గురైన ఖలిస్థానీ వేర్పాటువాది హర్‌దీప్ నిజ్జర్ సహాయకుడు అర్షదీప్ డల్లాను కెనడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఎన్డీటీవీ కథనం ప్రకారం.. గత నెల 27-28 తేదీల్లో హాల్టన్ ప్రాంతంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనకు సంబంధించి డల్లాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. డల్లా తన భార్యతో కలిసి సర్రేలో నివసిస్తున్నాడు. అతడిపై భారత్‌లో కిడ్నాప్, హత్య, ఉగ్రవాద సంబంధిత కేసులు ఉన్నాయి.

Similar News

News January 23, 2026

వృత్తులు చేస్తున్నారా? ఇలా చేస్తే నైపుణ్యం మీవెంట..

image

సరస్వతీ దేవిని ‘సకల కళా స్వరూపిణి’ అంటారు. అందుకే ఈ రోజున సంగీతకారులు తమ వాయిద్యాలను (వీణ, తబలా, వయొలిన్), చిత్రకారులు తమ కుంచెలను, డ్యాన్సర్స్ తమ గజ్జెలను పూజించాలి. దీనివల్ల వారిలో దాగి ఉన్న సృజనాత్మకత వెలికివస్తుంది. అలాగే వృత్తి పని వారు తమ పనిముట్లను శుభ్రం చేసి పూజించడం వల్ల ఆ వృత్తిలో నైపుణ్యం పెరిగి, ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి. ఏ రంగంలో అయినా ప్రతిభ చాటుకోవాలనుకునే వారికి ఈ దినం ఒక వరం.

News January 23, 2026

అమెజాన్‌లో 16 వేల ఉద్యోగాల కోత!

image

అమెజాన్‌లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా 16 వేల మందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెజాన్‌ 30 వేల మందిని తొలగించనుందని గతేడాది అక్టోబర్‌లో రాయిటర్స్ తెలిపింది. ఈ క్రమంలో తొలి విడతలో 14 వేల మందిని ఆ కంపెనీ ఇంటికి పంపింది. రెండో విడతలో భాగంగా ఈనెల 27 నుంచి లేఆఫ్స్ ఇవ్వనుందని సమాచారం. ఇప్పటికే తమకు మేనేజర్లు హింట్ ఇచ్చారని ఉద్యోగులు చెబుతున్నారు. 2023లోనూ 27 వేల మందిని అమెజాన్ తీసేసింది.

News January 23, 2026

మామిడిలో ఇనుపధాతు లోప లక్షణాలు – నివారణ

image

మామిడి చెట్లలో ఇనుపధాతు లోపం వల్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోయి ఆకుల సైజు తగ్గిపోతాయి. ఈ తీవ్రత ఎక్కువగా ఉండే మొక్కల ఆకులు పైనుంచి కింద వరకు ఎండిపోతాయి. ఇనుపధాతు లోపం సున్నపురాయి ఉన్న నేలలో సాధారణంగా కనబడుతుంది. ఇనుపధాతు లోపం నివారణకు 2.5 గ్రాముల అన్నభేది+1 గ్రాము నిమ్మ ఉప్పు లేదా ఒక బద్ద నిమ్మకాయ రసం లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.