News November 10, 2024
రాబోయే 4 రోజులు జాగ్రత్త: APSDMA

నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈనెల 14 వరకు రాష్ట్రంలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు కాకినాడ, కోనసీమ, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. రాబోయే 4 రోజుల వాతావరణ వివరాల కోసం <
Similar News
News January 17, 2026
మున్సిపల్ ఎన్నికల శంఖం పూరించిన రేవంత్

TG: పాలమూరు వేదికగా సీఎం రేవంత్ మున్సిపల్ ఎన్నికల సమరశంఖం పూరించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులనే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. తన సవాల్‌ను స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో తాము ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.
News January 17, 2026
రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు బృందం

AP: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం రేపు దావోస్ వెళ్లనుంది. 4 రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. 20 దేశాల తెలుగు ప్రజలను ఉద్దేశించి CM ప్రసంగించనున్నారు. UAE మంత్రి అబ్దుల్లా, టాటాసన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్‌తో భేటీ కానున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. 23న HYD చేరుకోనున్నారు.
News January 17, 2026
ఈ స్కీమ్ గురించి తెలుసా? ఆధార్ కార్డుతో రూ.90వేల లోన్

వీధి వ్యాపారులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ‘ప్రధానమంత్రి స్వనిధి’ అనే మైక్రో క్రెడిట్ స్కీమ్‌ను అందిస్తోంది. ఎటువంటి తాకట్టు లేకుండా 3 విడతల్లో రూ.90వేల లోన్ ఇస్తారు. ఆధార్ కార్డుతో ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో అప్లై చేసుకోవచ్చు. రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లించే వ్యాపారులకు ఏడాదికి 7% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. 2030 మార్చి 31 వరకు ఈ పథకం అందుబాటులో ఉండనుంది.
Share It


