News November 10, 2024
మోదీ, షా నుంచే దేశానికి ప్రమాదం: ఖర్గే
భారత్కు మోదీ, షా నుంచే ప్రమాదం పొంచి ఉందని AICC చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తాజాగా వ్యాఖ్యానించారు. దేశ ప్రజల్ని కాంగ్రెస్ కులాల ప్రాతిపదికన విభజిస్తోందని PM చేసిన విమర్శలపై ఆయన ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో స్పందించారు. ‘దేశాన్ని మతం, కులం పేరిట విభజించేది బీజేపీ వాళ్లే. మేం మనుషుల్ని ఏకం చేస్తాం. అలా ఏకం చేయడం కోసమే ఇందిర ప్రాణత్యాగం చేశారు. భారత్కు ముప్పు ఉందంటే అది బీజేపీ వల్లే’ అని మండిపడ్డారు.
Similar News
News November 14, 2024
నెహ్రూకు మోదీ నివాళి.. ఆధునిక భారతపితగా కొనియాడిన రాహుల్
జవహర్లాల్ నెహ్రూకు PM మోదీ, LoP రాహుల్ గాంధీ, ప్రియాంక, ఖర్గే సహా ప్రముఖులు నివాళులు అర్పించారు. ‘మాజీ ప్రధాని పండిత జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నాను’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘ఆధునిక భారత పిత, ఇనిస్టిట్యూట్ల సృష్టికర్త, ప్రథమ ప్రధాని, పండిత నెహ్రూకు గౌరవనీయ వందనాలు. మీ ప్రజాస్వామ్య, ప్రగతిశీల, నిర్భయ, దార్శనిక, సమ్మిళత విలువలను దేశం మర్చిపోదు’ అని రాహుల్ అన్నారు.
News November 14, 2024
వరుణ్ తేజ్ ‘మట్కా’ పబ్లిక్ టాక్
కరుణ కుమార్ డైరెక్షన్లో వరుణ్ తేజ్-మీనాక్షి చౌదరి నటించిన ‘మట్కా’ మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కినప్పటికీ కథలో కొత్తదనం లేదని, చాలా స్లోగా ఉందని, పాటలు ఆకట్టుకోలేదని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మెగా ప్రిన్స్ లుక్లో వేరియేషన్స్, యాక్టింగ్ బాగుందని మరికొందరు చెబుతున్నారు.
కాసేపట్లో WAY2NEWS రివ్యూ
News November 14, 2024
గ్రూప్-3 నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: CS
TG: నవంబర్ 17, 18 తేదీల్లో జరిగే గ్రూప్-3 పరీక్షకు 1401 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో పరీక్ష సజావుగా, సక్రమంగా నిర్వహించేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఇక పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నారు.